Mahesh Babu: నటుడిగా 42 ఏళ్లు పూర్తి చేసుకున్న మహేష్ బాబు
Mahesh Babu: మహేష్ బాబు నటుడిగా మారి 42 ఏళ్లు.. వేడుకల్లో అభిమానులు..
Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టిన మహేష్ బాబు ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగారు. తాజాగా మహేష్ బాబు నటుడిగా మారి 42 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మహేష్ బాబు మొట్టమొదటిసారిగా 1979 లో "నీడ" సినిమాలో నటించారు. దాసరి నారాయణరావు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అప్పుడు మహేష్ బాబు వయసు కేవలం నాలుగేళ్లు మాత్రమే. ఆ తర్వాత మహేష్ బాబు కోడి రామకృష్ణ దర్శకత్వంలో "పోరాటం" అనే సినిమాలో కూడా స్పెషల్ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా మహేష్ బాబు చాలా సినిమాల్లో నటించారు.
1999లో మహేష్ బాబు మొట్టమొదటిసారిగా హీరో గా "రాజకుమారుడు" సినిమా లో నటించారు. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా మారింది. ఆ తర్వాత మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మాన్, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు మొదలగు బ్లాక్బస్టర్ సినిమాలలో హీరోగా నటించారు. తాజాగా మహేష్ బాబు ఇండస్ట్రీ లో 42 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు ఒక కామన్ డిస్ప్లే పిక్చర్ (సి డి పి) ను రిలీజ్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇక మరో వైపు మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో "సర్కారు వారి పాట" సినిమా తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ ఫస్ట్ న విడుదల కాబోతోంది.