మొన్న ప్రభాస్..ఇప్పడు మహేష్...టాలీవుడ్ బిగ్ స్టార్లకు వరుసగా చిక్కులు
2018 ఎండింగ్ టాలీవుడ్ బిగ్ స్టార్లకు పెద్ద షాకే ఇచ్చింది. మొన్నటికి మొన్న గెస్ట్ హౌస్ సీజ్ వ్యవహారంలో ప్రభాస్‌కు చిక్కులు ఎదురవ్వగా తాజాగా హీరో మహేష్ బ్యాంక్ అకౌంట్స్ సీజ్ అంశం కలకలం రేపుతోంది. అగ్ర హీరోల విషయంలో అసలేం జరుగుతుందో తెలియక అభిమానులు అమోమయానికి గురవుతున్నారు
2018 ఎండింగ్ టాలీవుడ్ బిగ్ స్టార్లకు పెద్ద షాకే ఇచ్చింది. మొన్నటికి మొన్న గెస్ట్ హౌస్ సీజ్ వ్యవహారంలో ప్రభాస్‌కు చిక్కులు ఎదురవ్వగా తాజాగా హీరో మహేష్ బ్యాంక్ అకౌంట్స్ సీజ్ అంశం కలకలం రేపుతోంది. అగ్ర హీరోల విషయంలో అసలేం జరుగుతుందో తెలియక అభిమానులు అమోమయానికి గురవుతున్నారు. ఈ ఇద్దరు అగ్ర హీరోలకు డిసెంబర్ నెల అచ్చిరాలేదని అభిమానులు బాధపడుతున్నారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గం లో ప్రభాస్ గెస్ట్‌హౌజ్ సీజ్ వ్యవహారం సద్దుమణగక ముందే హీరో మహేష్ బాబు సర్వీస్ ట్యాక్స్ వివాదంలో చిక్కుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
హైదరాబాద్ శివారు ప్రాంతం రాయదుర్గం పాన్ మక్తలోని 'పైగా' భూములు ప్రభుత్వానివేనని కొద్ది రోజుల కిందట సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం కోర్టు కేసులు తొలగిపోవడంతో శేరిలింగంపల్లి తహసీల్దార్ ఆ స్థలంలోని నిర్మాణాలు తొలగించి స్వాధీనం చేసుకోవడం అక్కడే ఉన్న ప్రభాస్ అతిథిగృహం గేటుకు నోటీసు అంటించి సీజ్ చేయడం చకచకా జరిగిపోయాయి. సీజ్ ఘటనపై ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించడం న్యాయస్థానం యధాతథ స్థితిని కొనసాగించమని అదేశించడం అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారం తేలకముందే హీరో మహేష్ సర్వీస్ ట్యాక్స్ వివాదంలో చిక్కుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే కోర్టు పరిధిలో ఉన్న అంశంపై జీఎస్టీ కమిషనరేట్ చర్యలకు దిగడమేంటని మహేశ్ లీగల్ టీమ్ ప్రశ్నిస్తోంది. మహేశ్‌బాబు చట్టానికి కట్టుబడి పన్నులన్నీ సక్రమంగా చెల్లించారని అంటోంది. మొత్తానికి ప్రభాస్..మహేష్..ఘటనల్లో శుభం కార్డు పడుతుందా లేదా అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.