మహేష్ బాబు కూతురు సితారకి కరోనా టెస్ట్..

తెలుగు ఇండస్ట్రీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

Update: 2020-12-30 12:20 GMT

తెలుగు ఇండస్ట్రీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మెగా కుటుంబంలో రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇద్దరూ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారకి కూడా కరోనా కాటు తప్పలేదు. సితార కోవిడ్ టెస్ట్ చేయించుకుంది. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ మధ్య వరసగా హీరోలంతా సినిమా షూటింగ్స్ లో బీజీగా ఉన్నారు. ఈ తరుణంలోనే మహేష్ బాబు కూతురు సితార కూడా కరోనా టెస్ట్ చేయించుకుంది. టెస్ట్ చేస్తున్నపుడు తీస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

ఈ సందర్భంగా సితారా పోస్టు చేసింది. 'నేను కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను.. భయంగానే ఉన్నా అమ్మ పక్కనే ఉంది.. ఆమె చేయి గట్టిగా పట్టుకున్నాను.. చిన్న పిల్లలు ఎవరూ కరోనాకు బయపడోద్దు. కరోనా టెస్ట్ చేయించుకోడానికి భయపడొద్దు. తన కలిసిన వారు కూడా టెస్టులు చేయించుకోండి' అంటూ పోస్ట్ చేసింది సితార. ఇప్పుడు సితారా పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. తర్వలోనే తగ్గిపోతుంది. దైర్యంగా ఉండు పాప అంటూ మహేశ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

సితార తండ్రి మహేశ్ మాదిరే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. యూట్యూబ్ ఒక ఛానల్ కూడా మొదలు పెట్టింది. అంతే కాదు ఎప్పటికప్పుడు ఈ చిన్నారి కూడా తన అప్ డేట్స్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. తనకు కరోనా సోకిన విషయం కూడా పోస్టు చేసింది. 



Tags:    

Similar News