Madhavan: నాటు నాటు పాట పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న ప్రముఖ హీరో
Madhavan: రామ్ చరణ్, ఎన్టీఆర్ లని చూస్తుంటే అసూయగా ఉంది అంటున్న మాధవన్
Madhavan: ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "ఆర్ఆర్ఆర్". జనవరి 7 ఎప్పుడు ఎప్పుడు అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకు ఇప్పుడు చేదు అనుభవం ఎదురైంది. పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని సినిమా ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా "నాటు నాటు" పాటలో రామ్ చరణ్ ఎన్టీఆర్ డాన్స్ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ఈ పాటపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మాధవన్.
"నాటు నాటు పాట వీడియో ని చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. ఈ వీడియో చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల కెమిస్ట్రీ చూస్తే నాకు చాలా అసూయగా ఉంది. ఇద్దరిని చూస్తే చాలా గర్వంగా ఉంది. హాట్సాఫ్" అంటూ పాట వీడియో సాంగ్ ని కూడా షేర్ చేస్తూ వీరిద్దరి పై ప్రశంసల వర్షం కురిపించారు మాధవన్. దీంతో "థాంక్యూ మ్యాడీ" సార్ అంటూ "ఆర్ఆర్ఆర్" బృందం కృతజ్ఞతలు చెప్పగా మాధవన్ తిరిగి "మీరు బాక్సాఫీస్ ని బద్దలు కొట్టి బోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లను రీడిఫైన్ చేయబోతున్నారు" అంటూ రిప్లై ఇచ్చారు.