Madhavan About his Childhood Incident: హీరో మాధవన్ ని బాధపెట్టిన ఆ క్రికెటర్ ఆటోగ్రాఫ్!
Madhavan About his Childhood Incident: ఒక్కసారైనా సరే తమ అభిమాన సెలెబ్రిటీ కనిపిస్తే చాలు అనుకునే డై హార్డ్ ఫాన్స్ చాలా మందే ఉంటారు. పోనీ కనిపిస్తే అంతటితో ఆగిపోతారా.
Madhavan About his Childhood Incident: ఒక్కసారైనా సరే తమ అభిమాన సెలెబ్రిటీ కనిపిస్తే చాలు అనుకునే డై హార్డ్ ఫాన్స్ చాలా మందే ఉంటారు. పోనీ కనిపిస్తే అంతటితో ఆగిపోతారా... ఓ ఆటోగ్రాఫ్ దొరికితే బాగుండు కదా అని అనుకుంటారు. అలాగే హీరో మాధవన్ కూడా ఓ జాతీయ క్రికెటర్ ని అడిగిన ఆటోగ్రాఫ్ గురించి తాజాగా ఓ వీడియో చేస్తూ సోషల్ మీడియాలో వదిలాడు..
ఆ వీడియోలో మాధవన్ మాట్లాడుతూ.. "అందరిలాగే నాకూడా సెలబ్రిటీల దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఉండేది. అప్పుడు ఓ జాతీయ క్రికెటర్ దగ్గరికి వెళ్లి ఆటోగ్రాఫ్ అడిగాను.. అప్పటికే ఓ 50 ఆటోగ్రాప్‌లు ఇచ్చిన ఆ క్రికెటర్ అక్కడ ఎవరితోనో మాట్లాడుతూ కనిపించారు. నేను వెళ్ళగానే నాకు ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చారు.
కానీ ఒక్కసారి కూడా నా వైపు చూడలేదు.. అతను చేసింది తప్పో ఒప్పో తెలియదు కానీ ఆ సంఘటన మాత్రం నన్ను చాలా బాధపెట్టింది. ఇక ఆ సమయంలోనే నాకు నేనుగా నిర్ణయం తీసుకున్నాను.. ఒకవేళ భవిష్యత్‌లో నేను ఆటోగ్రాఫ్ చేయాల్సి వస్తే.. వారిని చూస్తూ చేయాలని " అని మాధవన్ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. అయితే ఆ క్రికెటర్ ఎవరు అన్నది మాత్రం మాధవన్ వెల్లడించలేదు..
ఇక మాధవన్ సినిమాల విషయానికి వచ్చేసరికి మొత్తం మాధవన్ ఇప్పటి వరకు ఏడూ భాషల్లో నటించారు. ఇలా ఏడూ భాషల్లో నటించిన అతి కొద్ది మంది నటుల్లో మాధవన్ ఒకరు . కెరీర్ మొదట్లో మాధవన్ టివీ సీరియళ్ళలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చారు. ఆ తరవాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా అలై పాయుదే(2000)తో కెరీర్ లో పెద్ద మలుపు వచ్చింది.
ఆ తరువాత ఏడాది గౌతం మీనన్ మొదటి సినిమా మిన్నలే, మద్రాస్ టాకీస్ వారి డుం డుం డుం సినిమాలతో రొమాంటిక్ హీరోగా మాధవన్ కి మంచి పేరు తీసుకువచ్చింది. ఒక సఖీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యాడు మాధవన్.. ప్రస్తుతం మాధవన్ నటించిన రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్, నిశ్శబ్దం, మారా చిత్రాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి..