MAA Elections: హేమ "మా" గౌరవాన్ని దెబ్బతీస్తుంది

MAA Elections: మా నిధుల దుర్వినియోగం చేశారంటూ ఇటీవల హేమ ఆరోపణ * హేమ ఆరోపణలపై నరేష్, జీవిత సీరియస్

Update: 2021-08-09 06:24 GMT

మా ప్రెసిడెంట్ నరేష్, హేమ (ఫైల్ ఇమేజ్)

MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా నిధులను దుర్వినియోగం చేశారంటూ ఇటీవల హేమ చేసిన ఆరోపణలను నరేష్, జీవిత ఖండించారు. హేమ వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తు్న్నామన్నారు. హేమ ఆరోపణలపై నరేష్, జీవిత వివరణ ఇచ్చారు అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. హేమ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని.. కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మా లో ప్రస్తుతం 4 కోట్ల 70 లక్షల రూపాయలు ఉన్నాయని నరేష్ తెలిపారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా తాము మా సభ్యుల కోసం ఎన్నో పనులు చేశామని స్పష్టం చేశారు. మా ఫండ్‌ను టచ్‌ చేయకుండా తామకున్న ఇమేజ్‌తో ఫండ్ తెచ్చుకున్నామన్నారు. ఇండస్ట్రీ పెద్దలు, ఫ్రెండ్స్ తమకు ఫండ్స్ విషయంలో సహకరించారని నరేష్ అన్నారు.

కరోనా టైంలో ఎలక్షన్స్ నిర్వహించకూడదని హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎలక్షన్స్ జరపడానికి రెడీగా ఉందని.. థర్డ్ వేవ్ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలా అని మీటింగ్‌లో చర్చించామన్నారు.

'మా' ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెలలో జరగనున్న 'మా' ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ప్రకటించడంతో ఒక్కసారిగా అందరి చూపు సినిమా పరిశ్రమపై పడింది. మా కు శాశ్వత భవనం ఏర్పాటు అనే నినాదంతో మొత్తం ఐదుగురు సభ్యులు ఈ ఏడాది అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌ తన ప్యానల్‌ను ప్రకటించగా.. విష్ణు, జీవిత, హేమ, నరసింహారావు గట్టి పోటీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

Full View


Tags:    

Similar News