OTT Movies: మూవీ లవర్స్‌కి ఈ వీకెండ్ స్పెషల్ ట్రీట్.. ఓటీటీలో ఇంట్రెస్టింగ్ హాలీవుడ్ మూవీస్..!
OTT Movies: సినిమాకు భాష అనే హద్దు చెరిగిపోయింది. మరీ ముక్యంగా ఓటీటీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలోని వివిధ భాషల్లో విడుదలైన చిత్రాలను సైతం ప్రేక్షకులను ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
OTT Movies: సినిమాకు భాష అనే హద్దు చెరిగిపోయింది. మరీ ముక్యంగా ఓటీటీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలోని వివిధ భాషల్లో విడుదలైన చిత్రాలను సైతం ప్రేక్షకులను ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. దేశీయంగానే కాకుండా కొరియన్, హాలీవుడ్ మూవీస్‌ను సైతం వీక్షిస్తున్నారు. ఓటీటీ వేదికగా అందుబాటులోకి వస్తున్న కంటెంట్ భాషలకు అతీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ వారాంతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఆకట్టుకునే మూవీస్ అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్లాస్ 95: ది పవర్ ఆఫ్ బ్యూటీ
నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈ సిరీస్ అందుబాటులోకి వస్తుంది. ఓ యువతి దృఢ నిశ్చయంతో మోడలింగ్ ఏజెన్సీ స్థాపించి తాను అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేధించింది. ఈ క్రమంలోనే తాను ఎలాంటి కష్టాలు ఎదుర్కొందన్న అంశాలను ఇతివృత్తంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.
ది పెంగ్విన్..
హెచ్‌బీఓ ఒరిజినల్స్ సమర్పణలో తెరకెక్కిన ది పెంగ్విన్ వెబ్ సిరీస్ జియో సినిమా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. కోలిన్ ఫారెల్ ప్రధాన పాత్రలో నటిచిన ఈ థ్రిల్లింగ్ సిరీస్‌పై భారీగా అంచనాలు ఉన్నాయి.
హిస్ త్రీ డాటర్స్..
ఈ వారాంతం ఓటీటీలో సందడి చేయడానికి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ హాలీవుడ్ మూవీ 'హిస్ త్రీ డాటర్స్'. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా సెప్టెంబర్ 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ 7.6 రేటింగ్ ఇవ్వడం విశేషం. అనారోగ్యంతో బాధపడుతున్న తమ తండ్రిని చూసుకోవడానికి న్యూయార్క్ నగరానికి వచచిన ముగ్గురు సోదరీమణలను చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది.
జో తేరా హై వో మేరా హై..
ఈ వారం ఓటీటీలోకి వస్తున్న బాలీవుడ్ మూవీ జో తేరా హై వో మేరా హై మూవీ జియో సినిమా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. రాజ్ త్రివేది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పరేష్ రావల్, అమిత్ సియాల్, సోనాలి కులరర్ణి నటించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
లా మైసన్..
యాపిల్ టీవీ+ వేదికగా స్ట్రీమింగ్ కానుంది లా మైసన్ అనే సిరీస్. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. ఫ్యాషన్ డిజైన్ విన్సెంట్ లేడు చుట్టూ ఈ కథ కేంద్రీకృతమై ఉంటుంది. ఫ్యాషన్ ఇండస్ట్రీలో తలెత్తిన డ్రామాగా నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.