ఎస్పీ బాలు తోలిపాట.. చివరి పాట ఏంటో తెలుసా?
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మొదటిపాట, చివరి పాట ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మొట్టమొదటిసారిగా ఎస్పీ బాలుకి శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంలో పాట పాడే అవకాశం లభించింది. ఈ సినిమా 1966 లో విడుదలైంది
Sp balasubramaniam First And Last Song : తెలుగు సినిమా పాట అంటే అందులో సగం అయన గురించే చెప్పాలి.. 1966లో ఓ పాట మొదలైన అయన ప్రయాణం ఎక్కడికో వెళ్ళిపోయింది. అయన తర్వాత ఎంతో మంది గాయకులూ వచ్చారు.. వస్తూనే ఉన్నారు.. అందరకి అయన స్ఫూర్తి.. ఏడుపదుల వయసులో కూడా ఎంతో యాక్టివ్ అయన తన గాత్రంతో అలరించారు.. ఆ పాట అంటే ఆయనే పాడాలి.. అయన పాడితే ఈ పాట ఆయన కోసమే పుట్టిందా అన్నట్టుగా ఉంటుంది.. దాదాపుగా 40వేలకి పైగా పాటలు పాడి చాలా మంది అభిమానులకి సొంతం చేసుకున్నారు. ఆయనే ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం.. మనం ముద్దుగా పిలుచుకునే ఎస్పీ బాలు..
ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మొదటిపాట, చివరి పాట ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మొట్టమొదటిసారిగా ఎస్పీ బాలుకి శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంలో పాట పాడే అవకాశం లభించింది. ఈ సినిమా 1966 లో విడుదలైంది. నటుడు, నిర్మాత అయిన పద్మనాభం ఈ సినిమాని నిర్మించగా, ఎస్.పి.కోదండపాణి సంగీతం అందించారు..
ఈ సినిమాలో "ఏమి ఈ వింత మొహం" అనే పాటను పాడారు బాలసుబ్రహ్మణ్యం.. ఈ పాటను పి సుశీలతో కలిసి ఆలపించారు బాలు.. ఈ పాటని సినిమాలో పద్మనాభం, గీతాంజలి లపైన చిత్రీకరించారు. ఇక ఆయన చివరగా గత ఏడాది వచ్చిన పలాస 1978 చిత్రంలో ఓ సొగసరి అనే పాటను పలాస బేబీతో కలిసి ఆలపించారు బాలు.. దీనికి రఘు కుంచె సంగీతం అందించగా, లక్ష్మి భూపాల ఈ పాటను రాశారు.
అత్యధిక పాటలు పాడిన సింగర్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు బాలు.. 16 భారతీయ భాషల్లో 40 వేలకి పైగా పాటలు పాడారు. మొత్తం అయన ఆరుసార్లు జాతీయ అవార్డులను అందుకున్నారు. ఓ సారి 12 గంటల్లో అయన 21 పాటలు పాడారు. దీనికి కన్నడ సంగీత దర్శకుడు ఉపేంద్ర కుమార్ సంగీతం అందించాడు.