లతా మంగేష్కర్‌ పాడిన తెలుగు పాటలు.. అవేంటంటే ?

Lata Mangeshkar Telugu Songs: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇకలేరు. 92 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూశారు.

Update: 2022-02-06 08:03 GMT

లతా మంగేష్కర్‌ పాడిన తెలుగు పాటలు.. అవేంటంటే ?

Lata Mangeshkar Telugu Songs: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇకలేరు. 92 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూశారు. ఇవాళ ఉదయం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో 08గంటల 12 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. లతా మంగేష్కర్‌కు కరోనాతో పాటు న్యుమోనియా కూడా ఉంది. వెంటిలేటర్‌పై ఉంచి డాక్టర్లు చికిత్స అందించారు. కొన్ని రోజుల తర్వాత ఆమె కోలుకున్నారు. ఆ తర్వాత మళ్లీ అనారోగ్యం తిరగబెట్టింది. శరీరంలోని అవయవాలు పనిచేయడం ఆగిపోయాయి. లతాను బతికించేందుకు డాక్టర్లు ఎన్నో ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు. చివరకు ఇవాళ ఉదయం లతాజీ కన్నుమూశారు. లతా మంగేష్కర్ గత 28 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. మల్టీఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగానే మృతి చెందినట్లు డాక్టర్ ప్రతీత్ సమ్దానీ తెలిపారు.

1942లో గాయనిగా ఆమె కెరీర్‌ ప్రారంభించారు. నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియాగా పేరున్న లతా దాదాపు 30 భాషల్లో 50 వేలకుపైగా పాటలు పాడారు. అత్యధికంగా హిందీ, మరాఠీ భాషల్లో ఆమె పాటలు పాడారు. లతా లేరనే వార్తతో శోక సముద్రంలో మునిగిపోయారు సినీ సంగీత అభిమానులు. లతాకు తెలుగులోనూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే తెలుగులో లతా చాలా తక్కువ సంఖ్యలో పాటలు పాడారు. తన మొత్తం కెరీర్‌లో లతా కేవలం మూడు అంటే మూడు పాటలు మాత్రమే స్ట్రెయిట్‌ తెలుగు మూవీస్‌లో పాడారు. లతా మంగేష్కర్‌ ఇప్పటి వరకు తెలుగులో పాడిన పాటలు ఇవే..

1955లో వచ్చిన 'సంతానం' సినిమాలోని 'నిదురపోరా తమ్ముడా' పాటను ఆలపించారు లతా. ఇప్పటికీ కొన్ని చోట్ల ఆ పాట వినిపిస్తూనే ఉంటుంది. అలానే 'దొరికితే దొంగలు' సినిమాలో 'శ్రీ వెంకటేశా' అనే పాట పాడారు. 1988లో వచ్చిన 'ఆఖరి పోరాటం' సినిమాలోని 'తెల్లచీరకు' అనే పాటను ఆలపించారు. 

Full View


Full View


Tags:    

Similar News