తెలంగాణ నేపథ్యంలో రానున్న 'లగ్గం' సినిమా.. అంగరంగ వైభవంగా టీజర్ లాంచ్..!
తెలంగాణ నేపథ్యంలో రానున్న 'లగ్గం' సినిమా.. అంగరంగ వైభవంగా టీజర్ లాంచ్..!
సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల కథ,మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. పెళ్లిలో ఉండే విందు, చిందు, కన్నుల విందుగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో సాగే తెలుగు సినిమా. రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ చిత్రం చూసి తప్పకుండా మాట్లాడుకుంటారు. ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు హీరో ఆది సాయికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. "లగ్గం టీజర్ చాలా బాగుంది. విజువల్స్ అదిరిపోయాయి. డైరెక్టర్ రమేష్ చెప్పాల మంచి టేస్ట్‌తో ఈ సినిమాను తీశారనిపిస్తుంది. నిర్మాత వేణు గారికి, చిత్ర యూనిట్ సభ్యులందరికి బెస్ట్ విషెస్. ఈ సినిమాలో నటించిన రాజేంద్రప్రసాద్, రోహిణి, కృష్ణుడితో నాకు మంచి అనుబంధం ఉంది. నాకు బాగా దగ్గరివారందరు ఈ సినిమాలో ఉండడం సంతోషంగా ఉంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు.
అనంతరం డైరెక్టర్ రమేష్ చెప్పాల మాట్లాడుతూ.. లగ్గం సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణమైన అందరికి ధన్యవాదాలు. ముఖ్యంగా నిర్మాత వేణు గోపాల్ రెడ్డి ఈ సినిమా కథను నమ్మి ముందుకు వచ్చారు. కథ, కథనం ఈ సినిమాకు బలం. కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది. టీజర్‌కు వస్తోన్న రెస్పాన్స్ చాలా బాగుంది" అని తెలిపారు.
అలాగే, నిర్మాత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. "మంచి సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నప్పుడు డైరెక్టర్ రమేష్ చెప్పాల తీసిన భీమదేవరపల్లి సినిమా చూశాను. ఆ సినిమా చాలా బాగా నచ్చి వెంటనే రమేష్‌తో సినిమా చేయాలని అనుకున్నాను. ఈ క్రమంలో రమేష్ లగ్గం కథ చెప్పాడు. కథ నచ్చి వెంటనే సినిమా స్టార్ట్ చేశాం. మంచి స్టోరీ, స్క్రీన్ ప్లే, ఫీల్ గుడ్ సాంగ్స్ లగ్గం సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.
నటి రోహిణి మాట్లాడుతూ.. "రాజేంద్రప్రసాద్‌తో కలిసి నటించడం ఒక ఛాలెంజింగ్‌గా అనిపించింది. లగ్గం సినిమా కోసం డైరెక్టర్ రమేష్ చెప్పాల రాసిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. చాలా సున్నితమైన సంభాషణలు ప్రేక్షకులని ఆలోచింపజేస్తాయి. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద అసెట్ అని చెపొచ్చు. ఈ సినిమాకు అన్ని చక్కగా కుదిరాయి. సంగీతం, సాహిత్యం, హృదయాన్ని కదిలించే సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయని" తెలిపారు.
ఈ సినిమాలో సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి తదితరులు నటించారు. లగ్గం సినిమాకు నేపథ్య సంగీతం మణిశర్మ అందించగా, సంగీతం చరణ్ అర్జున్ అందించారు.