Laggam Movie: సినిమా ప్రమోషన్స్ లో కొత్త ట్రెండ్.. ఏకంగా పెళ్లిలోనే..

Laggam Movie: సినిమా ప్రమోషన్స్ కొత్తగా చెయ్యాలి.. బజ్ క్రియేట్ చెయ్యాలి.. ప్రేక్షకుల్లోకి సినిమా తీసుకెళ్లాలి అని ఉద్దేశంతో డిఫరెంట్ ఐడియాలతో ముందుకొస్తున్నారు “లగ్గం” టీమ్.

Update: 2024-10-10 09:00 GMT

Laggam Movie: సినిమా ప్రమోషన్స్ కొత్తగా చెయ్యాలి.. బజ్ క్రియేట్ చెయ్యాలి.. ప్రేక్షకుల్లోకి సినిమా తీసుకెళ్లాలి అని ఉద్దేశంతో డిఫరెంట్ ఐడియాలతో ముందుకొస్తున్నారు “లగ్గం” టీమ్. రెగ్యులర్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్, లేక టాప్ ప్రొడ్యూసర్తో టీజర్ , ట్రైలర్స్ లాంచ్ చేపించడం అనేది మనం చూస్తున్నదే. కానీ వీటన్నింటినీ దాటి ఇప్పటివరకు ఎవ్వరు చెయ్యని విధంగా తమ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టింది. లగ్గం సినిమా టీమ్.

సినిమా మొదలుకొని పాటలు, పోస్టర్స్, టీజర్ అంటూ వరుసగా రోజు ప్రేక్షకులను పలకరిస్తూ “రీల్ పెట్టు - చీరపట్టు” అనే డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ప్రమోషన్స్ మొదలు పెట్టి దూసుకుపోతుంది. ఒక వైపు లగ్గం ట్రావెలర్ ఊరూరా తిరుగుతూ లగ్గం గిఫ్ట్స్ అందిస్తూ అందరికీ చేరువ అవుతుంది. అదే తరహాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం మరో కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది టీమ్.

లగ్గం సినిమా ట్రైలర్ ని నిజంగా లగ్గం (పెళ్లి) చేసుకుంటున్న నూతన వధూవరులతో లాంచ్ చేయించారు. ఇంజాపూర్ లో SPR శ్రీరస్తు కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఒక వివాహ వేడుకలో లగ్గం బృందం కూడా వచ్చి.. నూతన వధూవరులు గోవర్ధన్, అనూషలు మండపంలో ఉన్నపుడే.. వారి చేత లగ్గం సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసింది చిత్ర యూనిట్. 

ఈ నేపథ్యంలో లాగ్గానికి వచ్చిన అందరూ షాక్ అయ్యారు. వధూవరుల కూడా ఇది జీవితాంతం మాకు గుర్తుండి పోయే లగ్గం అని భావోద్వేగానికి లోనయ్యారు. సినిమా దర్శకుడు రమేష్ చెప్పాల, చిత్ర నిర్మాత సుభిషి ఎంటర్టైనమెంట్స్ అధినేత వేణుగోపాల్ రెడ్డి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

సాయి రోనక్, ప్రజ్ఞ నగ్ర హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగుణ ,లక్ష్మణ్ మీసాల, ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. 

Tags:    

Similar News