Krishna Vamsi: తెలంగాణ సాయుధ పోరాటంపై .. భారీ బడ్జెట్‌తో కృష్ణ వంశీ వెబ్ సిరీస్
Krishna Vamsi: తెలంగాణ సాయుధ పోరాటంపై .. భారీ బడ్జెట్‌తో కృష్ణ వంశీ వెబ్ సిరీస్
Krishna Vamsi: క్రియేటివ్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ ఒకప్పుడు నిన్నే పెళ్లాడతా, గులాబీ, సింధూరం, సముద్రం, అంతపురం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. కానీ ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వం వహించిన "గోవిందుడు అందరివాడేలే", "మొగుడు" తదితర సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారాయి. తాజాగా ఇప్పుడు కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ మరియు రమ్యకృష్ణ హీరో హీరోయిన్లుగా "రంగమార్తాండ" అనే సినిమాతో బిజీగా ఉన్నారు.
ఆగస్టులో ఈ సినిమా విడుదల కాబోతోంది. అలాగే రైతన్నల ఆకలి చావులపై "అన్నం" అనే పేరుతో కూడా ఒక సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు కృష్ణ వంశీ. అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటం పై ఒక వెబ్ సిరీస్ ని కూడా ప్లాన్ చేస్తున్నారట. తాజాగా దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవలం ఈ ఒక్క వెబ్ సిరీస్ కోసం కృష్ణవంశీ 300 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ సాయుధ పోరాటం పై ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ వెబ్ సిరీస్ లు మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలోనే ఈ పోరాటం గురించి పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు చూపించాలని కృష్ణవంశీ అనుకుంటున్నారు. అందుకే ఈ ప్రాజెక్టు పై ప్రస్తుతం కృష్ణవంశీ చాలా తీవ్రంగా పరిశోధన కూడా చేస్తున్నట్లు, అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ వెబ్ సిరీస్ ను ఐదు సీజన్లుగా, ఒక్కో సీజన్ కి 10 ఎపిసోడ్లు చొప్పున మొత్తం 50 ఎపిసోడ్లుగా విడుదల చేయాలని అనుకుంటున్నారు.