కోట శ్రీనివాసరావు నమస్కారం పెడితే బాలయ్య సంస్కారం లేకుండా ప్రవర్తించాడా..!?
Kota Srinivasa Rao: హాస్యనటుడిగా, విలన్ గా విభిన్న పాత్రల్లో నటించిన కోట శ్రీనివాస్ రావు తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. తన సినిమా కెరీర్లో ఎన్నో అవార్డులను కైవసం చేసుకున్న కోట తాజాగా ఒక ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు. తన సినిమా కెరీర్ మొదట్లో కోట శ్రీనివాస రావు ఎదురుకొన్న కొన్ని చేదు సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. మొదట బ్యాంకు ఉద్యోగిగా ఉన్న కోట నాటకాల మీద ఇష్టంతో అటు ఉద్యోగంతో పాటు నాటకాలు చేస్తూ ఉండేవాడు.అదే సమయంలో ప్రాణం ఖరీదు సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించిన కోట శ్రీనివాసరావు.. సూపర్ స్టార్ కృష్ణ "మండలాధీశుడు" అనే సినిమాలో ఎన్టీఆర్ ని అనుకరించే పాత్రలో కోట నటించాడు.
ఆ సినిమా చేసిన తరువాత అనేక రకాలుగా ఇబ్బంది పడ్డానని ఒకానొక సమయంలో తనపై ఒక రాజకీయ పార్టీకి సంబందించిన కొంతమంది కార్యకర్తలు చేయి చేసుకున్నారని, ఆ తరువాత ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ రాజమండ్రిలోని ఒక షూటింగ్ సమయంలో కలిసినపుడు అతనికి నమస్కారం పెడితే కోపంతో ముఖంపై ఉమ్మేసి వెళ్ళాడని చెప్తూ కోట శ్రీనివాసరావు బాధపడ్డాడు. ఇలాంటి చేదు సంఘటనలు తాను జీవితకాలం మర్చిపోలేనని కోట ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను బయటపెట్టాడు. తాజాగా కోట శ్రీనివాసరావు ఈ విషయాన్ని బయటపెట్టడంతో పలువురు నెటిజన్లు బాలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట శ్రీనివాసరావు వంటి వ్యక్తుల వయస్సుకైనా కొంచెం గౌరవం ఇవ్వాల్సిందని, ఇలా గౌరవం లేకుండా ప్రవర్తించడం సంస్కారం కాదంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా బాలయ్యపై సెటైర్లు వేస్తున్నారు.