థ్రిల్లర్ కథాంశంతో విశాల్ న్యూ మూవీ చక్ర గ్లింప్స్ ట్రైలర్..
తమిళ స్టార్ హీరో విశాల్ ఇటు టాలీవుడ్ లోను మంచి మార్కెట్ ఉంది. తాజాగా ‘చక్ర’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
తమిళ స్టార్ హీరో విశాల్ ఇటు టాలీవుడ్ లోను మంచి మార్కెట్ ఉంది. తాజాగా 'చక్ర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఎం.ఎస్.ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విశాల్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో రెజీనా ముఖ్యపాత్రలో నటిస్తోంది. చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ఆఫ్ ట్రైలర్‌ను విడుదల చేసింది.
ఈ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకునే తరహాలో ఉంది. ' విశాల్ గతంలో నటించిన 'అభిమన్యుడు' సినిమా తరహాలో 'చక్ర' సినిమాను కూడా తెరకెక్కించారు. సైబర్ క్రైమ్ చూట్టూ ఈ సినిమా తిరుగుతుంది. బ్యాంక్ రాబరీ, సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కించాడు. మొత్తంగా ఇప్పటి వరకు కథ, కథనాలతో ఈ చిత్రం తెరకెక్కింది. మరోసారి విశాల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమాతోనైనా హీరోగా విశాల్ మరో విజయం అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.