Kiara Advani:టాలీవుడ్‌ నిర్మాతలు షాకిచ్చిన కీయారా రెమ్యూనరేషన్‌!

Kiara Advani: కీయారా అద్వానీ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి హీరోయిన్లలో ఒకరు.

Update: 2021-05-12 16:30 GMT

కియారా అద్వానీ (ఫొటో ట్విట్టర్)

Kiara Advani: కీయారా అద్వానీ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి హీరోయిన్లలో ఒకరు. ప్రస్తుతం ఆమె హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ నటి తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలు చేస్తోంది. ఈ బాలీవుడ్ భామకి ముఖ్యంగా తెలుగులో చాలా అవకాశాలు వస్తున్నాయి.

కీయారా అద్వానీ పారితోషికం టాలీవుడ్ నిర్మాతలకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరు కీయారా. ఈ నటి 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించింది. ఆ తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు.

కీయారా అద్వానీ ప్రతీ సినిమాకు రూ. 3 కోట్లు తీసుకుంటోందంట. టాలీవుడ్ నిర్మాతలు ఈ రెమ్యూనరేషన్‌ను భరించేందుకు సిద్ధంగా లేరని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ప్రస్తుతం రెండు పెద్ద బడ్జెట్‌ సినిమాల కోసం చర్చలు జరుపుతోందంట. త్వరలో వాటి వివరాలు వెల్లడికానున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News