ఓటీటీలో కూడా డబ్బులు తీసుకుంటున్న "కే జి ఎఫ్"

*ఓటీటీలో కూడా డబ్బులు తీసుకుంటున్న "కే జి ఎఫ్"

Update: 2022-05-17 04:20 GMT

ఓటీటీలో కూడా డబ్బులు తీసుకుంటున్న "కే జి ఎఫ్"

KGF Chapter 2: కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ మధ్యనే థియేటర్లలో విడుదలైన సినిమా "కే జి ఎఫ్: చాప్టర్ 2". ఒకవైపు కన్నడలో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ కలెక్షన్లు నమోదు చేసుకుంది. ఇక హిందీలో కూడా ఈ సినిమా హవా బాగానే ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని ఫ్రీ గా కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో వారు 199 రూపాయలకు రెంట్ కి పెట్టడం అందరి షాక్ కి గురి చేస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన కొన్ని సినిమాలు ఈ మధ్య డైరెక్ట్ గా ఓటీటీ లోనే పే పర్ వ్యూ మోడల్ లో విడుదలయ్యాయి.

కానీ ఇప్పటికే థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన "కే జి ఎఫ్: చాప్టర్ 2" ని పే పర్ వ్యూ మోడల్ లో విడుదల చేయటం ఎందుకని అభిమానులు వాపోతున్నారు. కలెక్షన్లు పెంచుకోవడానికి ఈ పద్ధతి బాగానే ఉంటుంది కానీ ఇప్పటికే థియేటర్లలో చూసిన అభిమానులు ఓటీటీలో కూడా డబ్బులు పెట్టి చూసేందుకు ముందుకు వస్తారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News