Jani Master: నేరం ఒప్పుకున్న జానీ మాస్టర్: రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు

Jani Master: జానిమాస్టర్ బాధితురాలినిపెళ్లి చేసుకున్నాడు

Update: 2024-09-20 12:07 GMT

Jani Master: జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు.. నేరాన్ని అంగీకరించాడు

Jani Master Remand Report: జానీ మాస్టర్ తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో చెప్పారు. గోవాలో ఆయనను అరెస్ట్ చేసి సెప్టెంబర్ 19 రాత్రి హైద్రాబాద్ కు తీసుకు వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం జానీ మాస్టర్ ను ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపర్చారు. మేజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలను పోలీసులు ప్రస్తావించారు.

దురుద్దేశ్యంతోనే అసిస్టెంట్ గా నియామకం

తన వద్ద అసిస్టెంట్ గా బాధితురాలిని అపాయింట్ చేసుకోవడం వెనుక దురుద్దేశ్యం ఉందని పోలీసులు చెప్పారు. 2019లో బాధితురాలితో జానీ మాస్టర్ కు పరిచయం ఏర్పడింది. 2020 జనవరిలో ముంబై హోటల్ లో బాధితురాలిపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు చెబితే సినీ ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరింపులకు దిగారని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు తెలిపారు. 

వ్యానిటీ వ్యాన్ లొ కూడా లైంగిక వేధింపులు

వ్యానిటీ వ్యాన్ లో కూడా బాధితురాలిపై లైంగిక వేధింపులకు దిగాడని పోలీసులు చెబుతున్నారు. ఒకరోజున లైంగికవాంఛకు అడ్డుచెప్పినందుకుగాను జుట్టుపట్టుకుని అద్దంపై కొట్టారు.ఔట్ డోర్ షూటింగ్ లకు వెళ్లిన సమయంలో లైంగిక వేధింపులు ఉండేవి. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు దిగారు. అయితే వీటన్నింటిని భరించలేక అతని వద్ద అసిస్టెంట్ గా బాధితురాలు మానేసింది. అయితే ఆ సమయంలో ఆమె ఇంటికి భార్యతో కలిసి జానీ మాస్టర్ వెళ్లి దాడికి దిగారని రిమాండ్ రిపోర్ట్ చెబుతోంది.

లైంగిక వేధింపుల గురించి బాధితురాలు ఈ నెల 16న రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు కేసును బదిలీ చేశారు.ఈ కేసును నార్సింగి పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసు నమోదైన తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రత్యేక బృందాలు గోవాలో ఆయనను అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News