కీర్తి సురేష్ తొలి పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Keerthi Suresh Remuneration: 'మహానటి' సినిమాతో ఫాలోయింగ్ సంపాదించుకుంది కీర్తి సురేశ్.
Keerthi Suresh Remuneration: తెలుగులో 'నేను శైలజా' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ కీర్తి సురేష్. 'మహానటి' సినిమాతో ఫాలోయింగ్ సంపాదించుకుంది కీర్తి సురేశ్. ఆ సినిమాకు ముందు కొన్ని సినిమాలు చేసిన కీర్తికి పెద్దగా పేరు రాలేదు. అయితే మహానటి సినిమాతో ఈ భామకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. దివంగత నటీ సావిత్రిగా జీవించి ప్రజలను ఏడిపించింది. ప్రస్తుతం కీర్తి సురేశ్ రజనీకాంత్ అన్నాత్తే, మహేశ్‌బాబు సర్కారు వారి పాట చిత్రాల్లో నటిస్తోంది. కీర్తి ప్రధాన పాత్రలో నటించిన గుడ్ లక్ సఖి రిలీజ్‌కు రెడీగా ఉంది.
కీర్తి సురేశ్ బాలనటిగా కూడా పలు సినిమాల్లో నటిచింది. అప్పట్లో సినిమాకి తనకి ఎంత డబ్బు ఇచ్చారో కూడా తెలియదని చెప్పింది. ఇచ్చిన డబ్బును తన తండ్రికి ఇచ్చేదానిని అని చెప్పింది. తనకి ఊహా తెలిశాక 15వందల రూపాయలు పారితోషకం తీసుకుందట. కీర్తి సురేశ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను నటించిన సినిమాకు నిర్మాతలు డబ్బుల కవర్ చేతికిచ్చేవారు. దాన్ని నేరుగా తీసుకుని నాన్నకు అప్పజెప్పేదాన్ని.
అందులో అసలు ఎంత డబ్బుందని కూడా తెలుసుకోవాలనుకోలేదు. కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసేటప్పుడు ఒక షోలో పాల్గొన్నాను. అప్పుడు రూ.500 ఇచ్చారు. ఊహ తెలిశాక అందుకున్న డబ్బు ఇదే కాబట్టి. ఇదే నా తొలి సంపాదనగా భావించాను. కానీ సెంటిమెంట్‌గా మళ్లీ నాన్నకే ఇచ్చేశాను" అని చెప్పుకొచ్చింది.
కీర్తి సురేష్ తల్లి మేనక ప్రముఖ హీరోయిన్, తండ్రి సురేష్ ప్రముఖ నిర్మాత కావడంతో ఇంట్లో సినీ వాతావరణం ఉండేది. ఈ ఏడాది నితిన్ హీరోగా నటించిన 'రంగ్ దే' సినిమాలో నటించింది. ఈ సినిమా మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.