Kathi Mahesh Arrest: శ్రీరాముని పై కత్తి మహేశ్ వివాదస్ప వ్యాఖ్యలు.. అరెస్టు
Kathi Mahesh Arrest: సినీ రాజకీయ విశ్లేషకుడు, వివాదాలకు కేరాఫ్ కత్తి మహేష్ మరో సారి వార్తల్లోకి వచ్చారు. గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసి నగర బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే.
Kathi Mahesh Arrest: సినీ రాజకీయ విశ్లేషకుడు, వివాదాలకు కేరాఫ్ కత్తి మహేష్ మరో సారి వార్తల్లోకి వచ్చారు. గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసి నగర బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆయన్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. కత్తి మహేష్ తన ఫేస్ బుక్‌లో 'రాముడు కరోనా ప్రియుడు సుమీ' అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టుపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. వీటిపై స్పందించిన పోలీసులు కత్తి మహేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం మహేష్‌ను మొదట ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. తరువాత పోలీసులు శుక్రవారం(అగస్టు 14) విచారణ నిమిత్తం కత్తి మహేష్‌ను సైబర్ క్రైమ్ కార్యాలయానికి పిలిపించారు. అక్కడ విచారించి.. ఆయన్ను అరెస్ట్ చేశారు. ఐపీఎస్ సెక్షన్ 153(A) కమ్యూనల్ యాక్ట్ కింద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆపై నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.
కత్తి మహేష్ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు.. 2018లో రాముడుపై ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో.. నగర బహిష్కరణ చేశారు. పోలీసుల అనుమతి లేకుండా అతడు హైదరాబాద్ నగరానికి రాకూడదని ఆదేశాలు జారీచేశారు.