Karthikeya 2 Movie: కార్తికేయ 2 మూవీకి నేషనల్ అవార్డ్

70వ నేషనల్ ఫిలిం అవార్డ్ జాబితాలో ఉత్తమ తెలుగు ప్రాంతీయ బాషా చిత్రంగా కార్తికేయ 2 సినిమా నిలిచిన నేపథ్యంలో మరోసారి ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

Update: 2024-08-16 12:53 GMT

Karthikeya 2 Movie: 70వ నేషనల్ ఫిలిం అవార్డ్ జాబితాలో ఉత్తమ తెలుగు ప్రాంతీయ బాషా చిత్రంగా కార్తికేయ 2 సినిమా నిలిచిన నేపథ్యంలో మరోసారి ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఈ నేపథ్యంలో కార్తికేయ 2 సినిమాకు సంబంధించిన అంశాలపై ఆడియెన్స్ మరోసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కార్తికేయ 2 మూవీని ఇప్పటి వరకు చూడని వాళ్లు, ఈ సినిమా గురించి తెలియని వాళ్లు ఈ సినిమాకే నేషనల్ అవార్డ్ రావడానికి గల కారణం ఏంటని తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

కార్తికేయ 2 సినిమా విడుదలైన సందర్భంలోనే అందరినీ ఆకట్టుకుని మంచి పాజిటివ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఔను.. కార్తికేయ 2 చిత్రం నిజంగానే ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేసింది. తెలుగులో ఇప్పటివరకు తెరకెక్కిన అతికొద్ది అడ్వంచరస్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో కార్తికేయ 2 ముందు వరుసలో ఉంటుంది అని కచ్చితంగా చెప్పుకోవచ్చు. గతాన్ని, వర్తమానాన్ని, సైన్స్‌ని, పౌరాణికాన్ని బ్యాలెన్సింగ్‌గా తీసుకెళ్తూ చందూ మొండేటి చెప్పిన కథ ఆడియెన్స్‌ని స్క్రీన్స్‌కి కట్టిపడేసేలా చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. అంత అడ్వంచర్స్, సస్పెన్స్‌తో కూడిన కథనంలోనూ కామెడీని పండించి ఆడియెన్స్‌ని ఆద్యంతం అలరించడంలో చందూ మొండేటి నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యాడు. అందుకే ఆ సినిమాకు థియేటర్లలోనే కాదు... ఓటిటి ప్లాట్‌ఫామ్‌లోనూ భారీ రెస్పాన్స్ కనిపించింది.

ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్, బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సైతం ఒకరితో మరొకరు అన్నట్టు పోటీపడి మరీ నటించి తమ పాత్రలకు న్యాయం చేసి ఆకట్టుకున్నారు. కమెడియన్స్ శ్రీనివాస్ రెడ్డి, హర్ష చెముడు కలిసి పండించిన హాస్యం సినిమాకు మరో ప్లస్ పాయింట్. సినిమా లొకేషన్స్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ మరో అదనపు ఆకర్షణగా నిలిచాయి. సినిమా బ్యాక్‌డ్రాప్, బీజీఎం, స్క్రీన్‌ప్లే.. ఇలా ఏ అంశం తీసుకున్నా కార్తికేయ 2 సినిమాను వేలెత్తి చూపించే అంశమేదీ లేదు.

కార్తికేయ 2 సినిమాను తెరకెక్కించడంలో చిత్ర నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, టిజి విశ్వప్రసాద్ సైతం ఎక్కడ రాజీపడలేదు అని సినిమా చూసిన ప్రతీ ఒక్కరికి అర్థం అవుతుంది. అందుకే కార్తికేయ 2 సినిమాకు 70 నేషనల్ ఫిలిం అవార్డ్స్ జ్యూరీ సైతం ఫిదా అయింది. ఇలా ఎన్నో అంశాలు ఈ సినిమాకు కలిసొచ్చాయి కనుకే నేషనల్ అవార్డ్ వరించింది. 

70వ నేషనల్ ఫిలిం అవార్డ్ జాబితాలో ఉత్తమ తెలుగు ప్రాంతీయ బాషా చిత్రంగా కార్తికేయ 2 సినిమా చోటుదక్కించుకున్న నేపథ్యంలో తమ సినిమాకు నేషనల్ అవార్డు రావడంపై చిత్ర యూనిట్ సభ్యులు హర్షం వ్యక్తంచేశారు. అంతేకాదు.. కార్తికేయ 2 దర్శకుడు చందూ మొండేటి మరో అడుగు ముందుకేసి అభిమానులకు ఏకంగా మరో ఎగ్జైటింగ్ అప్‌డేట్ అందించాడు. కార్తికేయ 2 మూవీకి కొనసాగింపుగా కార్తికేయ 3 సీక్వెల్ ఉంటుంది అని చందూ మొండేటి స్పష్టంచేశాడు. ప్రస్తుతం తాను నాగ చైతన్య హీరోగా తండేల్ మూవీ తెరకెక్కిస్తున్నానని.. అది పూర్తయిన తరువాత కార్తికేయ -3 మూవీ పట్టాలెక్కిస్తానని చందూ తెలిపాడు. 

Tags:    

Similar News