Kantara: తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న "కాంతార" హవా
Kantara: తెలుగు రాష్ట్రాల్లో "కాంతార" కలెక్షన్లు మామూలుగా లేవుగా
Kantara: కన్నడలో రిషబ్ శెట్టి హీరోగా నటించిన "కాంతార" సినిమా కన్నడలో మాత్రమే కాక తెలుగులో కూడా అతి పెద్ద హిట్ గా నిలిచింది. నిజానికి సినిమా విడుదల అయ్యే వరకు ఏ మాత్రం బజ్ లేదు. కానీ విడుదలైన మొదటి రోజు నుండే ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది. ఇక వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల కూడా సినిమా తెలుగు వెర్షన్ 32.5 కోట్ల షేర్ ను సాధించింది. జానపద థ్రిల్లర్ గా కర్ణాటక నేటివిటీ ఉట్టి పడేలా ఉండే కథ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా రన్ అవుతోంది. స్ట్రెయిట్ తెలుగు సినిమాల కంటే మంచి కలెక్షన్స్ రాబట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ సినిమా తెలంగాణలో 12.5 కోట్లకు పైగా కలెక్షన్లు నమోదు చేయగా, ఆంధ్రప్రదేశ్‌లో 15 కోట్లకు పైగా షేర్ ను అందుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటి వరకు "కాంతార" తెలుగు వెర్షన్ 28 కోట్లు రాబట్టింది. మిగతా ఇండియా మరియు ఓవర్సీస్‌లో కలిపి "కాంతార" కలెక్షన్లు 4.5 కోట్లకు చేరాయి. తెలుగులో "కాంతార" ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన మొత్తం షేర్ 32.5 కోట్లు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ఊహించని విధంగా హిట్ అయ్యింది. ఈ సినిమా కి కథ, దర్శకత్వం మరియు కథానాయకుడు రిషబ్ శెట్టి సరిగ్గా "కాంతార" రిలీజ్ సమయంలో సర్దార్, ప్రిన్స్, ఓరి దేవుడా, ఊర్వశివో రాక్షసివో వంటి బోలెడు సినిమాలు విడుదలయ్యాయి కానీ "కాంతార" సాధించిన వాటితో పోలిస్తే సర్దార్ మినహా ఇతర సినిమా కలెక్షన్లు చాలా తకువ.