హీరో చిరంజీవి సర్జ గుండెపోటుతో మృతి.. విషాదంలో కన్నడ ఇండస్ట్రీ

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ కథానాయకుడు చిరంజీవి సర్జ కన్నుమూశారు. గుండెనొప్పితో చిరంజీవి ప్రాణాలు వదిలాడు.

Update: 2020-06-07 12:31 GMT
Actor chiranjeevi sarja(File photo)

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ కథానాయకుడు చిరంజీవి సర్జ కన్నుమూశారు. గుండెనొప్పితో చిరంజీవి ప్రాణాలు వదిలాడు. యాక్షన్ కింగ్ అర్జున్‌కు ఈయన మేనల్లుడు అవుతాడు. జూన్ 6న శ్వాస సమస్య బాధ పడటంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఊపిరి ఆడకుండా ఉండటంతో పాటు తీవ్రమైన ఛాతీ నొప్పి కూడా వచ్చింది. అయితే చిరంజీవి వయసు చాలా తక్కువ కావడంతో ఇది హృదయ సంబంధ వ్యాధి అని కుటుంబం అనుకోలేదు. కానీ దాంతో అతను ఇప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

చిరంజీవి 2009లో వాయుపుత్ర సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. చిరంజీవి సర్జ దాదాపు 25 సినిమాలు చేసాడు. 2018లో కన్నడ హీరోయిన్ మేఘనా రాజ్‌ను పెళ్లి చేసుకున్నాడు. మేఘనా రాజ్‌ టాలీవుడ్ లో అల్లరి నరేష్‌తో హీరోగా నటించిన బెండు అప్పారావు సినిమాలో నటించింది.

ఈ ఏడాది చిరంజీవి నటించిన మూడు సినిమాలు రీలీజ్ అయ్యాయి. మరో నాలుగు సినిమాలు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. చిరంజీవి కెరీర్ లో హీరోగా దూసుకుపోతున్న సమయంలో అర్ధాంతరంగా మరణించడంతో ఇండస్ట్రీ కూడా జీర్ణించుకోలేకపోతుంది. చిరంజీవి అభిమానులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు.

Tags:    

Similar News