Kangana Ranaut : కంగనా భద్రతకి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?

Kangana Ranaut : పలు వివాదాల నడుమ సెప్టెంబర్ 09 న ముంబైకి వచ్చిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నిన్న (సెప్టెంబర్ 14) న ముంబై నుంచి తన

Update: 2020-09-15 06:00 GMT

Kangana Ranaut

Kangana Ranaut : పలు వివాదాల నడుమ సెప్టెంబర్ 09 న ముంబైకి వచ్చిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నిన్న (సెప్టెంబర్ 14) న ముంబై నుంచి తన స్వస్థలం అయిన హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీ చేరుకున్నారు. అయితే ఆమె ముంబైకి చేరుకున్నప్పుడు ఆమెకు ప్రాణాపాయం ఉన్న నేపధ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 'వై ప్లస్‌' కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. అయితే కంగనా ఇప్పుడు హిమాచల్‌ ప్రదేశ్‌లో సురక్షితంగా ఉన్నారని ఆమెకి ఉన్న ఇచ్చిన భద్రతను ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు అడ్వొకేట్‌ బ్రిజేష్‌ కలప్ప తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

ఈ మేరకు అయిన ట్విట్టర్ లో స్పందిస్తూ.. " ఒక వ్యక్తికి నెలరోజుల పాటు వై ప్లస్‌' కేటగిరీ సెక్యూరిటీని కల్పించాలి అంటే కేంద్ర ప్రభుత్వం పైన 10 లక్షల భారం పడుతుందని, ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నుల్ని అందుకోసం ఖర్చు చేస్తారని అయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఆమె తన నివాసంలో సురక్షితంగా ఉన్నారని, ఇక కేంద్ర ప్రభుత్వం కంగనకు ఏర్పాటు చేసిన సెక్యూరిటీని వెనక్కి రమ్మని చెబుతుందా? అని ప్రశ్నించారు.

అయితే ఈ ట్వీట్ పైన కంగనా స్పందించింది. "బ్రిజేష్ జీ సెక్యూరిటీ అనేది మీరు, నేను ఊహించుకుని చెప్పేదాన్ని ఆధారంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం భద్రత ఇవ్వదు, నాకున్న ముప్పును ఐబి (ఇంటెలిజెన్స్ బ్యూరో) పరిశీలిస్తుంది. దాని ఆధారంగా నా సెక్యూరిటీ గ్రేడ్‌ను నిర్ణయిస్తారు. దేవుడి దయవల్ల త్వరలోనే ఆ భద్రతను పూర్తిగా తీసేయొచ్చు. ఇంకా ముప్పు ఉందని తెలుస్తే మరింత భద్రతను పెంచవచ్చు" అని తన ట్విట్టర్ లో రాసుకొచ్చింది.  



Tags:    

Similar News