Emergency: తెలంగాణలో ఎమర్జెన్సీ విడుదల కాదా.? కారణం అదేనా.?

ఇందులో కంగనా.. ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తున్నారు. 1975 జూన్ 25 నుంచి 1977 వరకు కొనసాగిన ఇండియన్ ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Update: 2024-08-30 11:15 GMT

Emergency: తెలంగాణలో ఎమర్జెన్సీ విడుదల కాదా.? కారణం అదేనా.?

బాలీవుడ్‌ క్వీన్ కంగనా రనౌత్ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం 'ఎమర్జెన్సీ'. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ నాటి కథంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ ప్రకటించిన నాటి నుంచే విమర్శలు మొదలయ్యాయి. ఈ సినిమాకు కంగనా దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో కంగనా.. ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తున్నారు. 1975 జూన్ 25 నుంచి 1977 వరకు కొనసాగిన ఇండియన్ ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక సెప్టెంబర్‌ 6వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. దీంతో ఈ సినిమాపై అప్పుడే రచ్చ మొదలైంది. తాజాగా సమాచారం ప్రకారం తెలంగాణలో ఎమర్జెన్సీ మూవీ విడుదలయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఎమర్జెన్సీ చిత్రాన్ని రాష్ట్రంలో నిషేధించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

మాజీ ఐపీఎస్ అధికారికి తేజ్ దీప్ కౌర్ మీనన్ నేతృత్వంలోని తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధి బృందం సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ అలీ షబ్బీర్‏ను కలిసి.. రాష్ట్రంలో ఎమర్జెన్సీ సినిమా విడుదల చేయకూడదని కోరినట్లు సమాచారం. ఈ సినిమాలో సిక్కు సమాజాన్ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని, ఈ మూవీ వాస్తవాలకు పూర్తిగా భిన్నంగా ఉందని ఫిర్యాదులో తెలిపారు. ఈ విషయాన్ని సీఎం రేంత్ దృష్టికి తీసుకెళ్లామని, ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ పై న్యాయపరమైన సంప్రదింపులు జరుపుతూనే విడుదలను నిషేధించే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం రేవంత్ రెడ్డి సిక్కు సంఘం నేతలకు హామీ ఇచ్చారని ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ అలీ షబ్బీర్‌ గురువారం తెలిపారు.

దీంతో ఎమర్జెన్సీ సినిమా విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రంలో సిక్కులను తీవ్రవాదులుగా, దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని, ఇది సహించలేమని.. అలాగే సమాజ ప్రతిష్టను దెబ్బతీసేలా చిత్రీకరించారని సిక్కు బృందం ఆరోపిస్తోంది. మరి ఎమర్జెన్సీ ఈ వివాదాలను దాటుకొని విడుదలవుందా.? లేదా అనేది తెలియాలంటే మరికొన్ని వేచి చూడాలి.

Tags:    

Similar News