Kangana Ranaut compares Mumbai to POK : ముంబైలోని కంగనా ఆఫీస్ కూల్చివేత.. బాబర్ ఆర్మీ అంటూ ..
Kangana Ranaut compares Mumbai to POK : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత మహారాష్ట్రలోని పలువురు
Kangana Ranaut compares Mumbai to POK : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత మహారాష్ట్రలోని పలువురు రాజకీయ నాయకులు పై, బాలీవుడ్ లోని పలువురు నటులపైన వాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంది ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ .. తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది కంగనా.. ముంబై లోని తన ఆఫీస్ ని మహారాష్ట్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా కూల్చివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆఫీస్ ని కూల్చుతున్నట్టుగా ఉన్న ఫొటోలను ఆమె ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.
" నేను ముంబయికి రావడానికి విమానాశ్రయానికి వస్తే... మరోపక్క మహారాష్ట్ర ప్రభుత్వం, అనుచరులు నా ఆస్తి దగ్గరికి వెళ్లి చట్టవిరుద్ధంగా దానిని విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మహారాష్ట్ర గౌరవం కోసం నేను నా రక్తం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నానని నేను వాగ్దానం చేశాను. నాకు ఆస్తి అతి చిన్న విషయం. ఇవేవీ నా ఆత్మస్థైర్యాన్ని తగ్గించవు, ఇంకా పెంచుతాయి " అంటూ కంగనా ట్వీట్ చేసింది.
అంతేకాకుండా " నేను ఎప్పుడూ తప్పు కాదు. నా శత్రువులు కూడా మళ్లీ మళ్లీ నిరూపిస్తున్నారు, అందుకే నా ముంబై ఇప్పుడు POK గా ఉంది అని కంగనా మరో ట్వీట్ చేసింది. అందులో తన కార్యాలయాన్ని రామ మందిర నిర్మాణంతో పోల్చుతూ..'బాబర్ ఆర్మీ' తన ఆఫీసును కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ ట్వీట్స్ కి డెత్ఆఫ్ డెమోక్రసీ అనే హాష్ ట్యాగ్ ని యాడ్ చేసింది కంగనా..
There is no illegal construction in my house, also government has banned any demolitions in Covid till September 30, Bullywood watch now this is what Fascism looks like 🙂#DeathOfDemocracy #KanganaRanaut
— Kangana Ranaut (@KanganaTeam) September 9, 2020