హైకోర్టు కీలక తీర్పు.. కంగనాకు ఊరట!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కి ముంబై హై కోర్టులో ఉరట లభించింది. ఆ మధ్య ముంబైలోని కంగనా కార్యాలయాన్ని అక్రమంగా ఉందంటూ బీఎంసీ (బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) కూల్చివేతకు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Update: 2020-11-27 10:50 GMT

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కి ముంబై హై కోర్టులో ఉరట లభించింది. ఆ మధ్య ముంబైలోని కంగనా కార్యాలయాన్ని అక్రమంగా ఉందంటూ బీఎంసీ (బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) కూల్చివేతకు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపైన ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కంగనా. దీనికి సంబంధిచిన తీర్పును ముంబై కోర్టు నేడు ప్రకటించింది. చట్ట ప్రకారం నిర్మించిన భవనాన్ని కుల్చివేసినందుకు గాను జరిగిన నష్టాన్ని తిరిగి చెల్లించాలని బీఎంసీ అధికారులకి కోర్టు సూచించింది.

దీనికి ముందు కంగనా మహారాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముంబైను పీవోకేతో పోల్చుతు కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపధ్యంలో ముంబైలోని కంగనా ఆఫీస్ రూల్స్ కి విరుద్దంగా ఉందంటూ బీఎంసీ అధికారులు దాన్ని కూల్చేందుకు సిద్ధమైయ్యారు. తాజాగా దీనిపైన విచారణ చేప్పట్టిన కోర్టు భవనాన్ని చట్ట విరుద్ధంగా కూల్చివేశారని తీర్పులో వెల్లడించింది. 

Tags:    

Similar News