మహాప్రస్తానంలో కైకాలకు కన్నీటి వీడ్కోలు.. ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు
మహాప్రస్తానంలో కైకాలకు కన్నీటి వీడ్కోలు.. ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు
Kaikala Satyanarayana: నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అధికారిక లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు జరిగాయి. కైకాల పెద్ద కుమారుడు లక్ష్మి నారాయణ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కైకాల పార్థివదేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని కైకాల నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర జరిగింది. అశ్రునయనాల మధ్య మహాప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు జరిగాయి. పెద్ద ఎత్తున అభిమానులు అంతిమయాత్రలో పాల్గొని తమ అభిమాన నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు.