Surya-Jyothika: అమ్మ అందుకే ముంబై వెళ్లింది.. సూర్య-జ్యోతిక విడాకుల రూమర్లపై కార్తీ మాటలు వింటే కన్నీళ్లే..!

Karti: కోలీవుడ్‌లోని అందమైన జంటలలో సూర్య-జ్యోతికల ఒకరిగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. వారి అభిమానులు కూడా వారిని అన్నావదిన అంటూ పిలుస్తుంటారు.

Update: 2023-09-24 15:00 GMT

Surya-Jyotika: అమ్మ అందుకే ముంబై వెళ్లింది.. రూమర్లపై కార్తీ మాటలు వింటే కన్నీళ్లే..!

Karti: కోలీవుడ్‌లోని అందమైన జంటలలో సూర్య-జ్యోతికల ఒకరిగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. వారి అభిమానులు కూడా వారిని అన్నావదిన అంటూ పిలుస్తుంటారు. అయితే, కొద్ది రోజుల క్రితం సూర్య-జ్యోతికలు విడిపోయారనే వార్తలు విరివిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జ్యోతిక తన పిల్లలతో కలిసి ముంబైలో ఉంటోంది. సూర్య ముంబై నుంచి చెన్నైకి ప్రయాణిస్తున్నాడు. 2006లో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పుడు హీరోయిన్ జ్యోతిక ఫుల్ బిజీగా ఉంది. ఇలాంటి కుటుంబంలో విభేదాలు రావడానికి జ్యోతిక కారణమని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అయితే సూర్య, జ్యోతికల పెళ్లి తండ్రి శివ కుమార్‌కు మొదటి నుంచి ఇష్టం లేదని, కొడుకు ఇష్టాన్ని కాదనలేక వీరిద్దరి వివాహం చేశారంట. ఇలాంటి సమయంలో జ్యోతిక ఈ నిర్ణయం తీసుకుందని మరో వర్గం అంటోంది. సూర్యతో పెళ్లికి ముందు జ్యోతికకు శివకుమార్ ఓ కండిషన్ పెట్టడంతో కొన్నాళ్లుగా జ్యోతిక సినిమాలకు దూరంగా ఉండిపోయిందని పుకార్లు కూడా వినిపించాయి.

అయితే, జ్యోతిక సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో సూర్య నాన్న శివకుమార్ జీర్ణించుకోలేకపోయాడంట. దీంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కుటుంబంలో గొడవల సమయంలో జ్యోతికకు సూర్య కూడా సహకరించాడంట. ఇదే విషయం సూర్య తండ్రికి నచ్చలేదని అంటున్నారు. దీంతో వీరి కుటుంబంలో గొడవలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయంట. ఇలాంటి సమయంలో కార్తీ తన సోదరుడు సూర్యకు మద్దతు ఇవ్వలేదని అంటున్నారు.

జ్యోతిక గురించి స్పందించిన కార్తీ..

సూర్య కుటుంబం గురించి రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ, ఇప్పటి వరకు వారి కుటుంబం నుంచి ఎటువంటి స్పందన లేదు. సూర్య కుటుంబం విడిపోవడానికి జ్యోతికనే ప్రధాన కారణమంటూ సోషల్ మీడియాలో వినిపిస్తోన్న కామెంట్స్‌పై కార్తీ అసహనం వ్యక్తం చేశారు. 'జ్యోతికను నేను నటిగా చూడలేదు. తల్లిలానే చూశాను. తను కూడా మమ్మల్ని తన పిల్లల్లాగే చూసుకుంది. అమ్మ ప్రస్తుతం ముంబైలో ఉంటుంది. దీంతో మా ఇల్లు ఖాళీగా అనిపిస్తోంది. అమ్మ లేని ఆ ఇంట్లో ఉండలేం. అమ్మతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం' అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే, ఇన్నాళ్లూ కలిసి ఉండడానికి జ్యోతికనే ప్రధాన కారణమని కార్తీ చెప్పుకొచ్చాడు. అయితే సూర్య అన్నయ్య పిల్లలు పెద్ద వారు అవుతున్నారు. కేవలం పిల్లల చదువుల కోసమే ముంబై వెళ్లింది. పిల్లల చదువులు పూర్తి కాగానే కచ్చితంగా అందరం కలుస్తాం. అయితే, ప్రతి పండుగకి ఆ ఇంట్లోనే అంతా కలుస్తుంటాం' అంటూ కార్తీ చెప్పుకొచ్చాడు. అయితే, జ్యోతిక గురించి కార్తీ చెప్పిన మాటలు అందర్నీ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.

Tags:    

Similar News