బాలీవుడ్ నటి జుహీ చావ్లాకు కొత్త చిక్కొచ్చిపడింది. 15 ఏళ్లుగా తన చెవికి ఉన్న రింగు హటాత్తుగా జారిపోయింది. ఆ చెవి రింగుతో తనకు 15 ఏళ్ల బంధముందని ఇప్పుడు హటాత్తుగా అది జారిపోడంతో దిగాలుపడ్డాననీ జుహీ అంటోంది. రింగు ఎక్కడ జారిపోయిందో తెలియటం లేదని.. తన రింగు ఎవరికైనా కనిపిస్తే తెచ్చివ్వాలంటూ ట్విట్టర్లో ఈ భామ వెల్లడించింది. ముంబై విమానాశ్రయంలోనే తన రింగు జారిపోయి ఉంటుందని కనిపించిన వారెవరైనా దానిని తనకు తెచ్చివ్వాలనీ ఆమె కోరుతోంది.