Devara Public Talk: దేవర ఎలా ఉంది.? అసలు పబ్లిక్ ఏమంటున్నారంటే..?
Devara Public Talk: తారక్ అభిమానుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది. ఎట్టకేలకు దేవర మూవీ థియేటర్లలోకి వచ్చేసింది.
Devara Public Talk: తారక్ అభిమానుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది. ఎట్టకేలకు దేవర మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. ట్రిపులార్ తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్న కొరటాల కసితో తెరకెక్కించిన చిత్రం ఇది. మరి ప్యాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుంది.? సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు ఏం చెబుతోన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతీ ఒక్కరూ దేవర చాలా బాగుందని అంటున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఎంట్రీ అదిరిపోయిందని, టైటిల్ కార్డ్, ఎంట్రీ సీన్స్ సమయంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతమని చెబుతున్నారు. అనిరుధ్ చెప్పినట్లుగానే ఈ సినిమా బీజీఎమ్ హాలీవుడ్ రేంజ్‌లో ఉందని అంటున్నారు.
అలాగే సముద్రంలో లోపల జరిగే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కచ్చితంగా ఆకట్టుకుంటాయని అంటున్నారు. ఇక ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ సినిమాకే హైలెట్‌గా నిలిచాయని అంటున్నారు. డ్యూయల్ రోల్ ట్విస్ట్ బాగుందని, దేవర, వర పాత్రలో చక్కటి వేరియేషన్ చూపించాడని అభిమానులు చెబుతున్నారు. ఇక దేవర మూవీ బాహుబలి స్పూర్తితో ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
వర పాత్రను చాలా బాగా డిజైన్ చేశారని సినీ లవర్స్ చెబుతున్నారు. పార్ట్2 కోసం క్యూరియాసిటీ పెంచేలా చిత్రాన్ని తెరకెక్కించారని ఫ్యాన్స్ చెబుతున్నారు. దేవర కచ్చితంగా పైసా వసూల్ మూవీ అని తెలిపారు. ఇక ఎన్టీఆర్ చెప్పినట్లుగానే చివరి 40 నిమిషాలు సినిమా అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఎన్టీఆర్ నటన చాలా బాగుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. చివరిలో వచ్చే ట్విస్ట్ ఊహకందని విధంగా తెలిపారు. కొరటాల డైరెక్షన్ బాగుందని అంటున్నారు. కమర్షియల్ అంశాలతోనే మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా కొరటాల ఈ సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది. కొరటాల శివ బలమైన నైతిక సందేశాన్ని అందించే కథతో ముందుకొచ్చాడు. ఈ చిత్రం హింస కాకుండా శాంతి గురించి మెసేజ్ ఇస్తుంది. రానున్న తరాల మధ్య విభేదాలను నివారించి సామరస్యాన్ని పాటించుకోవాలని దేవర కథగా తెలుస్తోంది.
Also Read: Devara First Review: 'దేవర' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. మూవీ ఎలా ఉందంటే..