Devara First Review: 'దేవర' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. మూవీ ఎలా ఉందంటే..

Devara First Review in Telugu: అన్ని సినిమాలపై నెగిటివ్‌ కామెంట్స్‌ చేసే క్రిటిక్‌ ఉమైర్‌ సంధు దేవర మూవీపై పాజిటివ్‌గా స్పందించారు.

Update: 2024-09-26 12:30 GMT

Devara movie First Review

Devara First Review: ఎన్టీఆర్‌ (Jr NTR) హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కిన దేవర (Devara) మూవీ కోసం ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ ఈ సినిమా  కోసం ఆసక్తిగా ఉంది. జాన్వీకపూర్ (Janhvi Kapoor) తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరిస్తుండడం, సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) విలన్‌ రోల్‌లో నటిస్తుండడంతో బాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది.

ఇక ట్రిపులార్‌తో ఎన్టీఆర్‌కు నేషనల్‌ వైడ్‌గా క్రేజ్‌ దక్కడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. ఆచార్య వంటి భారీ డిజాస్టర్‌ తర్వాత ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్న కొరటాల శివ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ లేకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. సెప్టెంబర్‌ 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 ఇప్పటికే ఈ సినిమాను విదేశాల్లో డిస్ట్రిబ్యూటర్స్‌తో పాటు పలువురు సినీ అభిమానులు చూశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. వీరి ప్రకారంగా  దేవర హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ప్రేక్షకులకి కొత్త ఫీలింగ్‌ను కలిగిస్తాయని ట్వీట్ చేస్తున్నారు. క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలిచాయని టాక్‌ నడుస్తోంది. ఇక అనిరుధ్‌ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌, ఎన్టీఆర్ నటన, రత్నవేలు సినిమాటోగ్రఫీ.. సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ అంటున్నారు.

అన్ని సినిమాలపై నెగిటివ్‌ కామెంట్స్‌ చేసే క్రిటిక్‌ ఉమైర్‌ సంధు దేవర మూవీపై పాజిటివ్‌గా స్పందించారు. దేవర కచ్చితంగా పైసా వసూల్ మూవీ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక మరో యూజర్‌ స్పందిస్తూ.. దేవర మూవీ లైన్‌ అద్భుతంగా ఉంది, ప్రతీ ఒక్క సినిమా లవర్ దేవర చూడాలని రాసుకొచ్చారు. ఇక కొరటాల శివ యాక్షన్‌ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారని, ఎన్టీఆర్‌ అద్భుత నటనతో ఆకట్టుకున్నారని మరో యూజర్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఇక విఎఫ్‌ఎక్స్‌ కూడా బాగుందని చివరి 30 నిమిషాలు సినిమాకే హైలెట్‌గా ఉంటుందని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు.



Tags:    

Similar News