Devara Box Office Collections: రికార్డు కలెక్షన్ల దిశగా దేవర.. ఫస్ట్ డే ఎన్ని కోట్లు రాబట్టనుందో తెలుసా?

Devara 1st Day Box Office Collection: ఎన్టీఆర్‌ (Jr NTR) కెరీర్‌లో అత్యధిక వసూలు (Box Office Collections) రాబట్టిన చిత్రం దేవర (Devara) నిలవడం ఖాయమని తెలుస్తోంది.

Update: 2024-09-27 14:25 GMT

Devara Box Office Collections

Devara 1st Day Box Office Collection: సినీ లవర్స్‌ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా దేవర హంగామా మొదలైంది. నిన్న రాత్రి ఓవర్‌సీస్‌లో విడుదలైన దేవర శుక్రవారం భారత్‌లో థియేటర్లలోకి వచ్చేసింది. తొలి షో నుంచి పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుందీ మూవీ. ఎన్టీఆర్‌ అద్భుత నటన, కొరటాల మార్క్‌ దర్శకత్వం, అనిరుధ్‌ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ సినిమాను విజయ తీరాలకు చేర్చింది.

ALSO READ: Devara Review: ఏం సినిమారా అయ్యా ఇది? hmtv హానెస్ట్ రివ్యూ

సినిమాకు మంచి టాక్‌ లభించింది. దీంతో ఈ సినిమా కలెక్షన్లపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. బాక్సాఫీస్‌ వద్ద దేవర ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తాడో అని ఫ్యాన్స్‌ ఎంతో ఆతృతతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే జరిగిన ప్రీ రిలీజ్‌ బిజినెస్‌తో పాటు అడ్వాన్స్‌ బుకింగ్స్‌తో దేవర తిరుగులేని రికార్డులను సృష్టించనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రిపులార్‌ వంటి భారీ హిట్‌ తర్వాత ఎన్టీఆర్‌ నటించిన ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టబోతున్నట్లు ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి.

ALSO READ: Jr NTR: నట దేవరకు ఈ ఐడెంటిటీ మామూలుగా రాలేదు...

ఈ సినిమా తొలిరోజు ఏకంగా రూ. 120 నుంచి రూ. 125 కోట్లు రాబట్టడం ఖాయమని అంటున్నారు. ట్రిపుల్‌ తర్వాత ఎన్టీఆర్‌ కెరీర్‌లో అత్యధిక వసూలు రాబట్టిన చిత్రం దేవర నిలవడం ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమా ప్రీసేల్స్‌లోనే ఏకంగా 15.27 లక్షల టికెట్లు అమ్ముడుపోయి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. వీటి విలువే అక్షరాల రూ. 38.84 కోట్లు కావడం విశేషం. ఓవర్‌సీస్‌ మార్కెట్లో తొలి రోజు దేవర వసూళ్లు రూ. 30 కోట్లుగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక ఇండియాలో తొలి రోజు దేవర సుమారు రూ. 90 కోట్ల వరకు రాబట్టొచ్చని అంచనా వేస్తున్నారు. సాయంత్రంకల్లా చిత్ర యూనిట్ ఇందుకు సంబంధించి అధికారిక ప్రటకన చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే తొలిరోజు అత్యధికంగా వసూళ్లు రాబట్టిన జాబితాలో కల్కి మొదటి స్థానంలో ఉంది. ఈ సినిమా ఫస్ట్‌ డే ఏకంగా రూ. 175 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పుడు దేవర రెండో స్థానంలో నిలవనుందని అంచనా వేస్తున్నారు. ఇక దేవర వసూళ్లు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. వీకెంట్ కావడం పెద్ద సినిమాలేవి పోటీలో లేకపోవడంతో వసూళ్లు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక వచ్చే వారంలో సెలవులు కూడా ఉండడం వల్ల ఈ సినిమా కలెక్షన్లపై సానుకూల ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags:    

Similar News