Devara: ‘బృందావనం’తో మా ఇంటి సభ్యుడిగా మారిన కొరటాల శివ.. దేవర సక్సెస్ పార్టీలో తారక్

Devara Success Meet: ఎన్టీఆర్ తాజా చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-04 06:59 GMT

Devara: ‘బృందావనం’తో మా ఇంటి సభ్యుడిగా మారిన కొరటాల శివ.. దేవర సక్సెస్ పార్టీలో తారక్

Devara Success Meet: ఎన్టీఆర్ తాజా చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేవర సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో చిత్ర నిర్మాతల్లో ఒకరయిన సుధాకర్ మిక్కిలినేని, సినిమాను తెలుగు రాష్ట్రాల్లో హోల్‌ సేల్‌‌గా కొనుగోలు చేసిన నిర్మాత నాగవంశీ సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. 'దేవర' టీం తో పాటు రాజమౌళి ఇంకా పలువురు సినీ ప్రముఖులు ఈ సక్సెస్ పార్టీలో పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు దేవర యూనిట్‌ సభ్యులకు సక్సెస్ పార్టీకి హాజరయిన అతిథులు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో హీరో తార‌క్ మాట్లాడుతూ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌పై ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ‘‘బృందావనం’ సినిమాతో మా ప్రయాణం మొదలైంది. ఇప్పుడాయన నా కుటుంబ సభ్యుడిగా మారారు. ‘దేవర 2’ చిత్రీకరణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని అన్నారు. నిర్మాణ సంస్థ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘నాకు, కల్యాణ్‌ రామ్‌ అన్నయ్యకు హరికృష్ణ కొసరాజు వెన్నెముకలాంటి వారు. ఆయన వల్లే ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ ఉంది’’ అని పేర్కొన్నారు.

ఇక దేవ‌ర‌లో ఎన్టీఆర్‌ స‌ర‌స‌న బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా నటించింది. అలాగే మ‌రో బాలీవుడ్ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించారు. ప్రకాశ్ రాజ్‌, శ్రీకాంత్‌, మురళీ శర్మ, మలయాళ న‌టుడు షైన్ టామ్ ఛాకో త‌దిత‌రులు ఇతర కీలక పాత్రల్లో మెరిశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి త‌మిళ యువ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద‌ర్ బాణీలు అందించారు.

Tags:    

Similar News