Jr NTR: తన డిప్రెషన్ గురించి ఓపెన్ అయిన ఎన్టీఆర్...
Jr NTR: ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలంటే, ఫ్యామిలీ, బ్యాక్ గ్రౌండ్, డబ్బులు, ఫిట్నెస్, అదృష్టం వంటివి మాత్రమే గుర్తొస్తాయి.
Jr NTR: ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలంటే, ఫ్యామిలీ, బ్యాక్ గ్రౌండ్, డబ్బులు, ఫిట్నెస్, అదృష్టం వంటివి మాత్రమే మనకి గుర్తొస్తాయి. కానీ వాళ్లు కూడా తమ కెరియర్లో కానీ జీవితంలో కానీ ఎప్పుడో ఒకచోట డిప్రెషన్ కి కానీ ఇతర మానసిక ఇబ్బందులకు గురయ్యే ఉంటారు. కానీ వాటి గురించి బయటకు చెప్పే నటులు కొంతమంది మాత్రమే ఉంటారు. అందులో ఒకరే జూనియర్ ఎన్టీఆర్.
తాజాగా తన "ఆర్ ఆర్ ఆర్" సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో డిప్రెస్ అయిన సంఘటనలు గురించి చెప్పారు. తన కెరియర్ లో వరుస డిజాస్టర్ లతో సతమతమైనప్పుడు తాను పడిన మానసిక క్షోభ గురించి ఓపెన్ అయ్యారు ఎన్టీఆర్. రాజమౌళి తో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా చేసేదాకా తనకి సినిమాల గురించి నటన గురించి చాలా తక్కువ తెలుసని అన్నారు ఎన్టీఆర్.
18 ఏళ్లకే బ్లాక్ బస్టర్ సినిమా లో నటించిన తారక్ ఆ తరువాత వరుస ఫ్లాప్ లతో సతమతమయ్యారు. "అప్పుడు నేను చాలా మానసికంగా కుంగిపోయాను. నా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని కాదు ఒక నటుడిగా నేనేం చేస్తున్నానో నాకు అర్థమయ్యేది కాదు. కానీ రాజమౌళి తో సినిమా చేయడం వల్ల ఒక పర్ఫార్మర్ గా నన్ను నేను అర్థం చేసుకోగలిగాను" అని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన "ఆర్ఆర్ఆర్" సినిమా భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.