Devara: ఫ్యాన్స్ షోలో అపశ్రుతి.. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మృతి

Devara: కడప జిల్లాలో దేవర సినిమా ఫ్యాన్స్ షో ముందు అపశృతి చోటుచేసుకంది. రాజా థియేటర్‌లో జరిగిన ఘర్షణ అనంతరం జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మస్తాన్ మృతి చెందారు.

Update: 2024-09-27 04:53 GMT

Devara: ఫ్యాన్స్ షోలో అపశ్రుతి.. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మృతి

Devara: కడప జిల్లాలో దేవర సినిమా ప్రదర్శన సమయంలో విషాదం చోటు చేసుకుంది.  రాజా థియేటర్ లో  జరిగిన ఘర్షణలో  జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మస్తాన్ మృతి చెందారు.  అభిమానుల కోసం ఈ థియేటర్ ప్రత్యేక షో వేశారు.  దీంతో పెద్ద సంఖ్యలో  అభిమానులు థియేటర్ వద్దకు వచ్చారు.

అయితే వారిని కట్టడి చేసేందుకు థియేటర్ యాజమాన్యం ప్రయత్నించింది. ఈ క్రమంలో థియేటర్ యాజమాన్యంపై ఎన్టీఆర్ అభిమానులు దాడికి దిగారు.  ఈ ఘర్షణలో  ఎన్టీఆర్ అభిమాని మస్తాన్ తీవ్రంగా గాయపడ్డారు.  విషయం తెలుసుకొని పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.  థియేటర్ నుంచి ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే  మస్తాన్ చనిపోయారు.  ఆయన స్వగ్రామం  చింతకొమ్మదిన్నె మండలం జమాల్ పల్లి గ్రామం.

Also Read: Devara Review: థియేటర్లలో మాస్‌ జాతర.. దేవర మూవీ రివ్యూ ఎలా ఉందంటే..?

Also Read: Devara Public Talk: దేవర ఎలా ఉంది.? అసలు పబ్లిక్‌ ఏమంటున్నారంటే..?

Tags:    

Similar News