Devara Movie OTT: దేవర ఓటీటీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌.. స్ట్రీమింగ్ అప్పటి నుంచేనా?

Devara Movie OTT: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Update: 2024-10-08 12:15 GMT

Devara Movie OTT

Devara Movie OTT: దేవర జైత్రయాత్ర కొనసాగుతోంది. ట్రిపులార్‌ వంటి భారీ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్‌ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. కొరటాల శివ మార్క్‌ డైరెక్షన్‌, ఎన్టీఆర్‌ అద్భుత నటన ఈ సినిమాను విజయతీరాలకు చేర్చింది. ఇప్పటి వరకు ఈ సినిమా సుమారు రూ. 400 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పోటీగా పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో దేవర రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీకి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. దేవర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. ఇందుకోసం నెట్‌ఫ్లిక్స్‌ ఏకంగా రూ. 155 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ఇదిలా ఉంటే ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ విషయానికొస్తే.. దేవర విడుదలైన 50 రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నయని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం అయినట్లు సమాచారం. నవంబర్‌ 15వ తేదీ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి చిత్ర యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే దేవర చిత్రానికి పార్ట్‌2 సైతం వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొంతమేర షూటింగ్ కూడా పూర్తయింది. అయితే పార్ట్‌2 మరింత ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు కొరటాల శివ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో సీక్వెల్‌పై అంచనాలు పెరిగిపోయాయి.

Full View


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags:    

Similar News