Jeevitha Rajasekhar: చెక్ బౌన్స్ కేసు పై రియాక్ట్ అయిన జీవిత...

Jeevitha Rajasekhar: ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్ మరియు జీవిత చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే...

Update: 2022-04-24 07:52 GMT

Jeevitha Rajasekhar: చెక్ బౌన్స్ కేసు పై రియాక్ట్ అయిన జీవిత...

Jeevitha Rajasekhar: ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్ మరియు జీవిత చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. "గరుడ వేగా" సినిమా నిర్మాణం కోసం దగ్గర డబ్బులు అప్పు తీసుకొని ఇప్పుడు కట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని కోటేశ్వర్ రాజు కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తల పై నోరు విప్పారు జీవితారాజశేఖర్. న్యాయస్థానం పై తమకి పూర్తి నమ్మకం ఉందని అందుకే ఈ విషయాల్లో లీగల్ గానే ముందుకు వెళ్తామని చెబుతున్నారు జీవిత.

"అసలు గరుడ వేగా సినిమా నిర్మించింది కోటేశ్వర్ రాజు, అలాంటిది మేము ఆయన దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నామని ఎలా చెబుతారు. సినిమాకి నిర్మాత కాకపోతే సినిమా కోసం ఇంకెవరు ఖర్చు పెడతారు" అని నిలదీశారు జీవిత. ఇక సినిమా నిర్మాణం తో కోటేశ్వర రాజు భార్య హేమా కి ఎటువంటి సంబంధం లేదని కానీ ఇప్పుడు కేసు విషయంలో ఆమె ఎందుకు మాట్లాడుతుంది అని అడిగారు జీవిత.

"మా మీద కేసు రెండు నెలల క్రితమే నమోదు చేశారు. అది ఇంకా నడుస్తూనే ఉంది. కేసు పెట్టిన తర్వాత కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్లు మా పరువు తీయాలని ప్రయత్నిస్తున్నారు కానీ మేము అవి పట్టించుకోము. ఇలాంటి అబద్ధపు ఆరోపణల విషయంలో మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాము" అని చెప్పుకొచ్చారు జీవిత.

Tags:    

Similar News