నాగచైతన్య సినిమాలో నేను కూడా ఉన్నాను అంటున్నా జె డి చక్రవర్తి

"నాగచైతన్య సినిమాలో నేను ఉన్నాను అని ఎవరికీ తెలియదు" అంటున్న జె.డి.చక్రవర్తి

Update: 2022-01-27 11:56 GMT

నాగచైతన్య సినిమాలో నేను కూడా ఉన్నాను అంటున్నా జె డి చక్రవర్తి

JD Chakravarthy: అక్కినేని నాగచైతన్య 2009లో జోష్ సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాని దిల్ రాజు స్వయంగా నిర్మించారు. 2009 సెప్టెంబర్ 5న ఈ సినిమా విడుదలైంది. మంచి అంచనాల విడుదల అయినప్పటికీ ఈ సినిమా అనుకున్న రేంజ్ లో హిట్ అవ్వలేకపోయింది. ఈ సినిమా ఫ్లాప్ అవడానికి గల కారణాల్లో నాగ చైతన్య లుక్స్ కూడా ఒకటని అభిమానులు ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు. అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర పాత్రలో జేడీ చక్రవర్తి నటించారు. కనిపించేది తక్కువ సన్నివేశాల్లో అయినా తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు జేడీ చక్రవర్తి.

అయితే తాజాగా "శ్రీ దేవీ డ్రామా కంపెనీ" ప్రోమో లో అతిథిగా విచ్చేసిన జె.డి.చక్రవర్తి "జోష్" సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. జోష్ సినిమా లో గోడ బ్యాచ్ ఉంటుంది అని రాంప్రసాద్ చెప్పగా గోడమీద అంటూ చక్రవర్తి పంచ్ వేశారు. అయితే రాంప్రసాద్ జోష్ సినిమా లో ఉన్నాడనే మాట బాధ కలిగించిందని జె.డి.చక్రవర్తి చెప్పగా, రాంప్రసాద్ మాత్రం అది జనాలకి కూడా గుర్తు లేదు అని గుర్తు చేయవద్దని అడిగారు. దీంతో జె.డి.చక్రవర్తి తాను కూడా సినిమాలో ఉన్నట్టు ఎవరికీ తెలియదు అని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News