Jatiratnalu in Piracy: పైరసీ ఉచ్చులో "జాతిరత్నాలు" సినిమా
Jatiratnalu in Piracy: ‘జాతి రత్నాలు' సినిమా ఫుల్ మూవీ డౌన్‌లోడ్ లింక్ కొన్ని వెబ్‌సైట్స్‌లో దర్శనమివ్వడం షాకిచ్చింది.
Jatiratnalu in Piracy: నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన కామెడీ ఎంటర్'టైనర్ జాతిరత్నాలు. అయితే ఈ సినిమాకు మొదటిరోజే పైరసీ రూపంలో ఎదురుదెబ్బ తగలడం చిత్ర యూనిట్‌లో ఆందోళన నెలకొల్పింది.
'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడిన నవీన్ పోలిశెట్టి ఈ 'జాతిరత్నాలు' సినిమాతో టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలి షోతోనే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో చిత్రయూనిట్ సంబరాల్లో మునిగిపోయింది. అయితే ఆ సంతోషాన్ని ఒక్క రోజు కూడా నిలవనీయకుండా ఎదురుదెబ్బ తీశారు కొందరు సైబర్ కేటుగాళ్లు. ఈ సినిమాను పైరసీ చేసి పలు వెబ్‌సైట్స్‌లో పెట్టేశారు. సరిగ్గా ఒక్క రోజు కూడా థియేటర్‌లో సినిమా ఆడకముందే 'జాతి రత్నాలు' సినిమా ఫుల్ మూవీ డౌన్‌లోడ్ లింక్ కొన్ని వెబ్‌సైట్స్‌లో దర్శనమివ్వడం షాకిచ్చింది. ఎంతైనా ఇది సినిమా కలెక్షన్స్‌పై ప్రభావితం చూపే అవకాశం ఉంది. కాగా ఇది తమిళ్ రాకర్స్ చేసిన పనే అని అంటున్నారు కొందరు. ఏదేమైనా పైరసీని అరికట్టడంలో ప్రతి ఒక్క ప్రేక్షకుడు భాగమైతే ఇలాంటి సైబర్ కేటుగాళ్లు ఆటలు సాగవని చెప్పుకోవచ్చు.
చిత్రసీమలో ఎవ్వరికీ అంతుచిక్కని భూతం పైరసీ. ఎన్నో యప్రయాసాలకోర్చి, రేయింబవళ్లు వందలాది మంది కష్టపడి సినిమా రూపొందిస్తే దాన్ని ఒక్కరోజులోనే పైరసీ చేసి వారి కష్టాన్ని దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ పైరసీ ఇష్యూపై ఎంత అవగాహన కల్పించినా, ఎన్ని చర్యలు తీసుకున్నా వారిని నివారించడం మాత్రం కష్టతరమవుతోంది. నిన్న (గురువారం) విడుదలైన ఈ సినిమాకు పైరసీ రూపంలో ఆదిలోనే ఎదురుదెబ్బ తగలడం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.