Pawan Kalyan On SPB : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆత్మస్థైర్ధ్యం ఉన్న వ్యక్తి : పవన్ కళ్యాణ్

Pawan Kalyan On SPB : దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతుంది.. ముఖ్యంగా ఈ కరోనా ప్రభావం సినీ ఇండస్ట్రీ పైన ఎక్కువగా ఉందని

Update: 2020-08-16 05:49 GMT
pawan kalyan, spb (File Photo)

Pawan Kalyan On SPB : దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతుంది.. ముఖ్యంగా ఈ కరోనా ప్రభావం సినీ ఇండస్ట్రీ పైన ఎక్కువగా ఉందని చెప్పాలి.. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.. అందులో భాగంగానే ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చేరినప్పుడు అయన ఆరోగ్యం నిలకడగానే ఉన్న గత గురువారం రాత్రి మాత్రం ఒక్కసారిగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీనితో ఆయన ఆరోగ్యం నుంచి కోలుకోవాలని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

అందులో భాగంగానే సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. " ప్రఖ్యాత గాయకులు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో స్థెర్యం ఉన్నవారు. ఆయన ప్రస్తుత అనారోగ్య స్థితి నుంచి వీలైనంత త్వరగా కోలుకొని మన ముందుకు వస్తారనే విశ్వాసం ఉంది. చెన్నైలో లైఫ్‌ సపోర్ట్‌ తో ఉన్నారు అని నిన్నటి రోజున తెలియగానే ఆత్మస్థైర్యం నిండుగా ఉన్న ఆయన తప్పకుండా కోలుకొంటారని భావించాను. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఊరటనిచ్చే వార్త ఇది. మా కుటుంబానికి బాలు గారు ఎంతో సన్నిహితులు. వారు ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలి అని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను " అని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనని విడుదల చేశారు.

ఎస్పీ బాలుకి ప్లాస్మా ట్రీట్‌మెంట్ :

అయితే ఎస్పీబీ ఆరోగ్యం విషమించడంతో ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు వెంటిలేటర్ పై ఆయనను ఉంచి చికిత్స అందిస్తున్నారు.. రెండు రోజుల నుంచి ఆయన వెంటిలేటర్ మీద ఉంటూ వైద్యం తీసుకుంటున్నారు. అయితే అయనకి ప్లాస్మా చికిత్స చేయాలని వైద్యులు నిర్ణయానికి వచ్చారు. ఇటీవల ప్లాస్మా నుంచి చాలా మంది ప్రముఖులు కోలుకున్న సంగతి తెలిసిందే.



Tags:    

Similar News