హాట్ యాంకర్ రష్మీ ఒకవైపు టీవీ షోలతో మరొకవైపు సినిమాలతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యాంకర్లలో రష్మీ కూడా ఒకరు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ ఉండే రష్మీ ఎవరైనా ట్రోల్ చేసినా వారి నోరు మూయించే రెస్పాన్స్ లు కూడా ఇస్తూ ఉంటుంది. తాజాగా రేప్ గురించి రష్మీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. రేపులు జరగడానికి కారణం అమ్మాయిలు మిని స్కర్ట్లు వేసుకోవడం అని కొందరు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే కొన్ని మీమ్స్ కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలో వారిపై విరుచుకు పడింది రష్మీ.
రేప్ లకు కారణం అమ్మాయిలు వేసుకుంటున్న మినీ స్కట్స్ అంటూ కొందరు చేస్తున్న విమర్శలపై రష్మీ సీరియస్ అయ్యింది. రేప్ అనేది ఫాన్సీ పదం కాదని, దాన్ని సరదాగా వాడొద్దని ఆమె ఆ పోస్టు ద్వారా పేర్కొంది. అలా జరిగే సమయంలో ఆడవారు అనుభవించే క్షోభ మాటల్లో చెప్పలేనిదని అసలు మిని స్కర్టులు రాకముందు నుంచే రేపులు జరుగుతున్నాయని ఆమె గుర్తు చేసింది. ఆమె ట్వీట్ ని కొందరు ప్రశంసిస్తూ తను చెప్పింది నూటికి నూరు శాతం నిజమని కామెంట్లు పెడుతుండగా, మరికొందరు మాత్రం ఎప్పటి లాగానే ఆమెను ట్రోల్ చేస్తున్నారు. మరి రష్మీ వారికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఇస్తుందో వేచి చూడాలి.