Rithu: నాన్నా ఒక్కసారి తిరిగిరావా.. జబర్దస్త్ నటి ఎమోషనల్ పోస్ట్...
Rithu Chowdary: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాంతో పాపులర్ అయిన నటి రీతూ చౌదరి ఇంట విషాదం నెలకొంది.
Rithu Chowdary: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాంతో పాపులర్ అయిన నటి రీతూ చౌదరి ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తనకు నాన్న అంటే ఎంత ఇష్టమో సందర్భం వచ్చినప్పుడల్లా ఆమె చెబుతుంటుంది. తాజాగా తండ్రి మరణంపై సోషల్‌మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోను స్టోరీలో పెట్టి 'నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఆ ఫోటో తీసుకునే సమయంలో ఇలా పోస్ట్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నీతో తీసుకున్న లాస్ట్ ఫోటో ఇదే నాన్న. నన్ను ఎలా వదిలి వెళ్లిపోయావు నాన్న? నువ్వు లేకుండా నేను ఉండలేను. డాడీ ప్లీజ్ తిరిగిరా.. నీ కుతురు దగ్గరికి' అంటూ రీతూ చౌదరి ఎమోషనల్ అయింది.