13 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతున్న బొమ్మరిల్లు హిందీ రీమేక్!
ఇంతటి ప్రేక్షాదరణ పొందిన ఈ సినిమాని 2007 లో బాలీవుడ్ లోకి రీమేక్ చేశారు.. బోనీకపూర్ నిర్మాతగా అన్నీస్ బజ్మి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు.
సిద్దార్థ్, జెనిలియా హీరోహీరోయిన్ లుగా వచ్చిన బొమ్మరిల్లు చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.. కొడుకు గురించి అతిగా పట్టించుకునే తండ్రి, తండ్రి వైపు ప్రేమ, కోపం మధ్య నలిగే కొడుకు పడే ఘర్షణ నేపధ్యంలో కథ నడుస్తోంది.. 2006 లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకి బాగా నచ్చింది.
ముఖ్యంగా సిద్ధార్థ్, ప్రకాష్ రాజ్, జెనిలియా తమ పాత్రలకు ప్రాణం పోశారు.. ఇప్పటికి ఈ సినిమా వస్తే ఇంటిల్లిపాది కలిసి చూస్తారు.. ఇంతటి ప్రేక్షాదరణ పొందిన ఈ సినిమాని 2007 లో బాలీవుడ్ లోకి రీమేక్ చేశారు.. బోనీకపూర్ నిర్మాతగా అన్నీస్ బజ్మి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. హర్మన్ బవేజా, జెనీలియా జంటగా నటించారు. ప్రకాష్ రాజ్ చేసిన పాత్రనునానా పటేకర్ పోషించారు..
అయితే వివిధ కారణాల వలన వాయిదా పడింది.. అయితే 13 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి మోక్షం లభించింది.. ఈ సినిమాని నవంబర్ 29న జీ సినిమాలో నేరుగా ప్రసారం చేయనున్నారు.. ఈ విషయాన్ని నిర్మాత బోని కపూర్ వెల్లడించారు.. మరి ఇన్నేళ్ల తర్వాత బుల్లితెర పైన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందా? లేదా?అన్నది చూడాలి మరి.. అటు ఈ సినిమా ట్రైలర్ కి విశేషమైన స్పందన వస్తోంది..