Indian 3: ఇండియన్ 3 చిత్ర యూనిట్ సంచలన నిర్ణయం.. సినిమా విడుదలపై..
Indian 3: కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు చిత్రం అప్పట్లో ఓ సెన్సేషన్.
Indian 3: కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు చిత్రం అప్పట్లో ఓ సెన్సేషన్. 1996లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో థియేటర్లలో సంచలనం సృష్టించింది. అత్యధికంగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. లంచంపై శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆలోజింప చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఇన్నేళ్ల తర్వాత భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ఇండియన్2 పేరుతో సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.
ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందుకోలేకపోయిందని చెప్పాలి. జులై 12వ తేదీన దేశవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమా అసంపూర్తిగానే మిగిలిన విషయం తెలిసిందే. దేశంలో లంచాలు పెరుగుతోన్న నేపథ్యంలో మళ్లీ వచ్చిన భారతీయుడు చిక్కుల్లో ఇరుక్కుపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్న అంశాలను ఇతివృత్తంగా ఇండియన్ 3 చిత్రం కూడా వస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇండియన్ 2 ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇండియన్ 3 చిత్ర విడుదలకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రయూనిట్ వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఈ విషయాన్ని అధికారింగా ప్రకటించారు. ఇండియన్ 3 మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. 2025 జనవరిలో ఈ చిత్రాన్ని నేరుగో ఓటీటీలోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే సినిమా విడుదల తేదీకి సంబంధించి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ తెరకెక్కిస్తున్నారు.