ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ వాయిదా!

nternational Film Festival : ఈ ఏడాది నవంబర్‌లో జరగాల్సిన 51వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వాయిదా పడింది. కరోనా వైరస్ నేపథ్యంలో నవంబర్ 20 నుంచి 28 వరకు జరగాల్సిన ఉత్సవాలను వాయిదా వేస్తున్నామని.. వచ్చే ఏడాది జనవరి 16 నుంచి 24 వరకు

Update: 2020-09-24 10:58 GMT

International Film Festival

International Film Festival : ఈ ఏడాది నవంబర్‌లో జరగాల్సిన 51వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వాయిదా పడింది. కరోనా వైరస్ నేపథ్యంలో నవంబర్ 20 నుంచి 28 వరకు జరగాల్సిన ఉత్సవాలను వాయిదా వేస్తున్నామని.. వచ్చే ఏడాది జనవరి 16 నుంచి 24 వరకు IFFIని నిర్వహిస్తామని గోవా ప్రభుత్వం తెలిపింది. ఫెస్టివల్‌ నిర్వహిస్తే కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని గోవా సర్కారు అభిప్రాయపడింది.

కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ విషయం గోవా ముఖ్యమంత్రితో చర్చించిన తరువాత ఐఎఫ్‌ఎఫ్‌ఐని వాయిదా వేసే నిర్ణయం తీసుకున్నట్లు గురువారం గోవా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇక గ‌త ఏడాది ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో 76 దేశాల‌కు చెందిన 200 సినిమాల‌ను స్క్రీనింగ్ చేశారు. ఇదిలావుంటే గోవాలో ఇప్పటి వరకు 29వేల కరోనా కేసులు నమోదు అయ్యాయి.

ఇక అటు దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో 86,508 కేసులు నమోదు కాగా, 1129 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 87,374 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కొత్త కేసులతో కలిపి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 57 లక్షల 32 వేలు దాటింది.



Tags:    

Similar News