Fight Masters Ram Laxman: ఆ బండరాయే మమ్మల్ని ఇంత దూరం తీసుకువచ్చింది : రామ్ లక్ష్మణ్..

Fight Masters Ram Laxman: టాలీవుడ్ లో రామ్, లక్ష్మణ్ అంటే తెలియని వారు ఉండరు.. ఫైట్ మాస్టర్ లుగా అందరికి వీరు సుపరిచితులే..వారితో పనిచేసిన

Update: 2020-07-23 07:51 GMT
Ram Laxman(File Photo)

Interesting Facts About Fight Masters Ram Laxman : టాలీవుడ్ లో రామ్, లక్ష్మణ్ అంటే తెలియని వారు ఉండరు.. ఫైట్ మాస్టర్ లుగా అందరికి వీరు సుపరిచితులే..వారితో పనిచేసిన వారికి ఇప్పటికి రామ్, లక్ష్మణ్ ని గుర్తుపట్టడం కష్టంగా ఉంటుంది! రూపులోనే కాదు.. వినయంలోనూ ఇద్దరికి ఇద్దరూ సాటే అని అనిపించుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరిద్దరూ వారి జీవితంలో ఎదురుకున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

" మేము పదిహేడు, పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు ఊర్లోనే మేకలు, పశువులను కాసుకుంటూ ఉండేవాళ్ళం .. ఆ సమయంలోనే ఎదో సాధించాలనే ఉద్దేశంతో ఇంట్లో వారి అనుమతితో చెన్నైకి బయలుదేరాము. అక్కడ ఆకలి కోసం చాలా తిప్పలు పడ్డాము. ఇక సురేశ్‌ హీరోగా 'శివుడు' సినిమాలో అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన, 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం' సినిమాలో అవకాశం వచ్చింది. అక్కడి నుంచి ఇప్పటివరకూ ఫైట్‌ మాస్టర్లుగా 200కిపైగా సినిమాలకు పని చేశామని" వెల్లడించారు.

ఇక తమ జీవితానికి ఎంతో స్పూర్తిని ఇచ్చిన బండరాయి, దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు రామ్, లక్ష్మణ్ .. " మేము పుట్టి పెరిగింది అంతా పల్లెటూరులోనే .. ఆ పల్లెటూరులో ఏ సాహసం చేసిన సరే హీరో లాగే చూసేవారు. అయితే ఆ ఊర్లో పెద్ద బండరాయి ఉండేది. దానిని ఎవరూ ఎత్తలేకపోయేవారు. ఓ రాత్రి మేము దానిని ఎత్తుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఓ పండగ పూట ఊర్లో అందరి ముందు ఆ బండరాయిని ఎత్తి చూపించాం. ఆ సంఘటన మాలో చలా ఆత్మస్థైర్యాన్ని నింపి ఇక్కడికి వరకు తీసుకువచ్చింది" అని రామ్ , లక్ష్మణ్ చెప్పుకువచ్చారు. 

Tags:    

Similar News