Salaar: 15 ఏళ్ల క్రితమే మొదలైన ప్రభాస్ 'సలార్'.. ఈ ఆసక్తికర విషయాలు మీకోసం?

Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోన్న సినిమా మరికొద్ది గంటల్లో థియేటర్లోకి రానుంది.

Update: 2023-12-21 15:15 GMT

Salaar: 15 ఏళ్ల క్రితమే మొదలైన ప్రభాస్ 'సలార్'.. ఈ ఆసక్తికర విషయాలు మీకోసం?

Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోన్న సినిమా మరికొద్ది గంటల్లో థియేటర్లోకి రానుంది. దీంతో ఎక్కడ చూసినా డార్లింగ్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం (Salaar Movie) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే, ఈ మేరకు సలార్ సినిమా గురించి, కొన్ని ప్రత్యేక విషయాలు తెలుసుకుందాం.

‘సలార్‌’ స్టోరీకి బీజం 15 సంవత్సరాల క్రితం మొదలైంది. అయితే, విశేషం ఏంటంటే, ప్రశాంత్‌ నీల్‌ అప్పటికి డైరెక్టర్ కాదంట. దర్శకుడిగా తన తొలి సినిమాను తీద్దామని ప్లాన్ చేసినా.. ఇలాంటి భారీ కథను తెరకెక్కించాలంటే, బడ్జెట్‌ కూడా భారీగా కావాల్సి ఉంటుంది. కొత్త డైరెక్టర్‌పై ఇంత భారీ మొత్తంలో బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు సాహసించరు. అందుకే, కొన్ని సినిమాలు తీశాక ‘సలార్‌’ను తీయాలని అనుకున్నాడంట.

ఈ క్రమంలో ప్రశాంత్‌ నీల్‌ ‘ఉగ్రం’ సినిమాతో మొదటిసారి డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘కేజీయఫ్‌ 1’, ‘కేజీయఫ్‌ 2’ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచాడు. ఆ రెండు సినిమాల హిట్ తర్వాత ఆయన తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ ‘సలార్‌’ను మొదలుపెట్టారు.

పాన్‌ ఇండియా రేంజ్‌లో పేరు తెచ్చుకున్న ప్రభాస్‌ను దృష్టిలో ఉంచుకుని, దేవ పాత్రను రాసుకున్నాడంట. అమాయకత్వంతో ఈ పాత్రను తీర్చిదిద్దాడంట. అయితే, ఈ సినిమాను 2 పార్టులుగా తీయాలని ముందుగా మాత్రం ప్లాన్ చేయలేదంట. సినిమా తీస్తున్న సమయంలో రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నారు.

సినిమా పోస్టర్స్, ట్రైలర్స్ విడుదలైన నేపథ్యంలో సలార్ సినిమాపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. అలాగే కేజీఎఫ్ సినిమాలకు సలార్‌కు సంబంధం ఉందని కామెంట్లు కూడా వినిపించాయి. అయితే, వీటిపై డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు. అలాగే, ‘ఉగ్రం’ సినిమాకు రీమేక్‌ అంటూ చెప్పుకొచ్చారు. అది కూడా కాదని తేలింది. వీటితో పాటు మరో రూమర్ కూడా వినిపించింది. ‘కేజీయఫ్‌’ హీరో యశ్‌ ఈ సినిమాలో కనిపిస్తాడని కూడా చెప్పుకొచ్చారు.

‘దేవ’కు సమానంగా ఉండే మరో పాత్ర వరదరాజ మన్నార్‌‌ది. ఈ పాత్రకు మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమార్‌ కరెక్ట్‌గా సూట్ అయ్యాడు. ఆయననే ఊహించుకుని కథను రాసుకున్నాడంట. అలాగే, జగపతి బాబు, ఈశ్వరీ రావు, టీనూ ఆనంద్‌ కీలక పాత్రల్లో నటించారు.

సలార్ సినిమా షూటింగ్ 2021 జనవరి 29న తెలంగాణలోని గోదావరిఖనిలో మొదలైంది. ఆ తర్వాత, హైదరాబాద్, మంగళూరు, వైజాగ్‌ పోర్టులో షూటింగ్ చేశారు. మొత్తం 114 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశారు. అయితే, సినిమాలో హైలెట్‌గా నిలిచే ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఓ యాక్షన్‌ సీన్ కోసం రూ.20 కోట్లు ఖర్చు పెట్టారంట. అలాగే, ఇందులో 1000 మందితో ఫైట్‌ ఉంటుందని అంటున్నారు. సలార్ సినిమా కోసం రూ.270 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు.

సలార్ సినిమాలో హింసాత్మక సీన్స్ ఉండండతో సెన్సార్‌ బోర్డు ఈ సినిమాకి ‘ఏ’ సర్టిఫికెట్‌ జారీ చేశారు. ఈ సినిమా రన్‌టైమ్‌: 2 గంటల 55 నిమిషాల 19 సెకన్లుగా ఉందంట. ‘కేజీయఫ్‌’ సినిమాతో నరాచీ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌.. ‘సలార్‌’ సినిమాతో ఖాన్సార్‌ ప్రపంచాన్ని చూపించబోతున్నాడు.

సలార్ సినిమా ముఖ్యంగా ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య నడుస్తుందంట. కాగా, ఈ సినిమాలో బద్ధశత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథే ఈ సినిమాగా చెబుతున్నారు. ఇద్దరు మిత్రులు దేవ- వరదరాజ మన్నార్‌‌లు అసలు శత్రువులుగా ఎందుకు మారారు? అసలు ఖాన్సార్‌ కథేంటి? తెలుసుకోవాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News