Vishal: తమిళ నటుడు విశా‌ల్‌కు గాయాలు

Vishal: లాఠీ సినిమా షూటింగ్‌లో గాయపడ్డ విశాల్‌

Update: 2022-02-12 08:30 GMT

Vishal: తమిళ నటుడు విశా‌ల్‌కు గాయాలు

Vishal: త‌మిళ హీరో విశాల్ తెలుగు వారికి పరిచ‌య‌మే. పందెంకోడి సినిమా నుండి లేటెస్ట్‌గా వ‌చ్చిన సామాన్యుడు వ‌ర‌కు విశాల్ సినిమాలు డ‌బ్బింగ్ రూపంలో ఇక్కడ విడుద‌లై మంచి విజ‌యాల‌ను సాధించాయి. ప్రస్తుతం ఈయ‌న లాఠీ అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి వినోద్ కుమార్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలోని ఓ యాక్షన్ స‌న్నివేశాన్నీ చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో ప్రమాదానికి గురైయ్యాడు. ఈ విష‌యాన్ని స్వయంగా విశాల్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

లాఠీ చిత్రంలో విశాల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. విలన్స్ దగ్గర నుంచి ఓ బాబును కాపాడే సన్నివేశంలో విశాల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో విశాల్ చేతికి, నుదిటి భాగంలో గాయమైందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈయ‌న‌ కేర‌ళాలోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. గాయం కారంణంగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ను ఆపేశారు. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్రముఖ స్టంట్ మాస్టర్ పీట‌ర్ హెయిన్స్ కొరియోగ్రఫి చేస్తున్నాడు. మార్చి మొద‌టివారంలో తిరిగి షూటింగ్ ప్రారంభించునున్నట్లు విశాల్ వెల్లడించాడు. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో సున‌య‌న హీరోయిన్‌గా న‌టిస్తుంది.

Tags:    

Similar News