ఈ సంవత్సరం చికెన్ బిర్యానీదే హవా .. నిమిషానికి 95 మంది ఆర్డర్

చికెన్ బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉంటారా? అంటే లేదనే చెప్పాలి. బిర్యానీ చేయాలంటే కష్టం కానీ తినాలంటే కష్టం కాదు కదా?

Update: 2019-12-24 16:14 GMT
Chicken Biryani ( File Photo)

చికెన్ బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉంటారా? అంటే లేదనే చెప్పాలి. బిర్యానీ చేయాలంటే కష్టం కానీ తినాలంటే కష్టం కాదు కదా? చేతులో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఒక్క ఆర్డర్ పెడితే చాలు.. క్షణాల్లో మన ముందు బిర్యానీ వాలదు. లెగ్ పీసులు, భాస్మతి బియ్యం, పెరుగు, మిరపకాయల కోర్మా, అందులో మళ్ళీ అంచుకు ఉల్లిపాయలు, నిమ్మకాయ ముక్కలు ఆహ చెబుతుంటేనే నోరు ఊరుతుంది. ఇక కళ్ళముందు ఉంటే క్షణాల్లో లాగించేయరు

ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీని ఎంతమంది ఇష్టపడుతున్నారనే విషయమై ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ 2019 రిపోర్టును విడుదల చేసింది. ఈ ఏడాదిలో ఎక్కువగా డెలివరీ చేసిన ఐటమ్స్‌లో మొదటి స్థానంలో చికెన్ బిర్యానీనే నిలిచింది. దీనిని ఎక్కువ మంది ఆర్డర్ చేసినట్టుగా స్విగ్గీ యానువల్ రిపోర్టు తెలిపింది.

చికెన్ బిర్యానీని దేశవ్యాప్తంగా సగటున నిమిషానికి 95 చికెన్ బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్టు ఆ సంస్థ చెప్పుకొచ్చింది. అయితే ఇది కేవలం స్విగ్గీ వరకే పరమితం. మిగతా జొమాటొ, ఉబర్ ఈట్స్ వంటి ఇతర యాప్‌ల నుంచి ఎంతమంది ఆర్డర్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అయితే చికిన్ బిర్యానీ ఇలా మొదటి స్థానంలో నిలవడం ఇదే ప్రధమం కాదు. గత అయిదు సంవత్సరాల నుంచి ఇలాగే మొదటి స్థానంలో కొనసాగుతుంది.

ఇక చికెన్ బిర్యానీ తర్వాత మసాలా దోశ,పన్నీర్ బటర్,చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ తర్వాతి స్థానలలో ఉన్నాయని స్విగ్గీ రిపోర్డు తెలిపింది.  

Tags:    

Similar News