డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యా : సోషల్ మీడియాలో కంగనా పాత వీడియో వైరల్!
Kangana Ranaut’s Video Viral : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాను కూడా డ్రగ్స్ కి బానిస అయినట్టుగా చెప్పిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్
Kangana Ranaut's Video Viral ; బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాను కూడా డ్రగ్స్ కి బానిస అయినట్టుగా చెప్పిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. మార్చి నెలలో కంగనా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన స్వస్థలమైన మనాలిలో ఉన్నప్పుడు కంగనా ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కంగనా మాట్లాడుతూ.. " నటిని కావాలన్న ఉద్దేశంతో ఇంటినుంచి పారిపోయి ముంబైకి వచ్చాను.. కొన్ని సంవత్సరాల తర్వాత హీరోయిన్ అయ్యాను.. అంతేకాకుండా డ్రగ్స్‌కి బానిసయ్యాను. నేను యుక్తవయసులో ఉన్నప్పుడు జరిగింది. నేను చాలా మంది చెడ్డవ్యక్తులతో ఇబ్బంది పడ్డాను" అని కంగనా అందులో పేర్కొంది. అయితే ఇప్పుడు ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెను మీరు కూడా డ్రగ్స్ తీసుకున్నారా? ప్రశ్నిస్తున్నారు.
"Main drug addict thi" pic.twitter.com/0m7GeVyde3
— Shivam Vij (@DilliDurAst) September 12, 2020
ఇక ఇది ఇలా ఉంటే బాలీవుడ్ సెలబ్రిటీలు 99శాతం మంది డ్రగ్స్ తీసుకుంటారని, అలాంటి వారితో తనకి ఎలాంటి సంబంధం లేదని, ఒకవేళ ఉన్నాయని నిరూపిస్తే ముంబై విడిచి వెళ్తానని కంగనా గతంలో ట్వీట్ చేశారు. ఇక డ్రగ్స్ సరఫరా చేసే వారితో కంగనాకి సంబంధాలు ఉన్నాయని గతంలో కంగనా మాజీ ప్రియుడు అధ్యాయన్ సుమన్ చేసిన ఆరోపణలు చేశారు. డ్రగ్స్ కేసులో భాగంగా ఆమెను విచారణ చేయాలనీ మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను సైతం జారీ చేసింది.
I am more than happy to oblige @MumbaiPolice @AnilDeshmukhNCP please do my drug tests investigate my call records if you find any links to drug peddlers ever I will accept my mistake and leave Mumbai forever, looking forward to meet you 🙂 https://t.co/gs3DwcIOvP
— Kangana Ranaut (@KanganaTeam) September 8, 2020
ఇక బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో భాగంగా డ్రగ్స్ అంశం కలకలం రేపుతుంది. ఈ కేసులో A1 నిందితురాలుగా ఉన్న రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంస్థ మంగళవారం అరెస్ట్ చేసింది. ఈ కేసులో 25 మంది సెలబ్రిటీల పేర్లను ఆమె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇందులో టాలీవుడ్ నుంచి రకుల్ పేరు వినిపించడం షాక్ కి గురి చేస్తోంది.